Sunday, November 24, 2024

ఆమె మరో సీత – గోదాదేవి

8వ శతాబ్దంలోనే మహిళలు చదివే సాధించి ఆండాళ్

వీరిలో కేవలం గోదాదేవిగారు ఒక్కరే స్త్రీ రచయిత. 8వ శతార్దికాలంనుంచే ఆడవారు వేదాలను చదువుకున్న వారే కాకుండా పన్నెండు మందిలో ఏకైక ప్రముఖులను చెప్పడానికి చరిత్ర చెబుతున్నది. ఆడవారు చదువుకోకూడదనే దుర్మార్గాన్ని ఈ విధంగా మహిళలకు చెప్పిన తరువాత కూడా శతాబ్దాలపాటు వారిని వెనుక పంచేట్టుచేయడం దారుణం.  శ్రీరంగనాథుడిని భర్తగా పొందడానికి ధనుర్మాసంలో మార్గళి వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో, వటపత్ర శాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాశురాలు ‘తిరుప్పావై’గా నాలాయిర ప్రబంధంలో నిబద్ధమయ్యాయి. ద్రవిడ వేదానికి తిరుప్పావై హృదయం లాంటిది. మహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది.

ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. రంగనాథుని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం.శ్రుతి, స్మృతుల మూలార్థాన్ని తేట తేట పదాలతో తమిళంలో పాశురాలుగా పాడి, ధనుర్మాస (శ్రీ) వ్రతాన్ని ఆచరించింది.

గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి ‘ప్రియమైన’ చెలికాడు ఆరాధించారు.  ఆనాడు గోపికలు అనంత శక్తిస్వరూపుడైనిగా రాధా వలె ప్రేమించారు.పూజించారు. శ్రీరంగనాథుడిని ప్రేమించి విష్ణుడై భక్త భార్యనైగా, మీరా వలె లీనమై పొందగలిగారు. నాయికా భావంతో శ్రీరంగనాయికగా ప్రకటితమైన మహిత ప్రేమమూర్తి ఆండాళ్.

తమిళనాటి శ్రీవిల్లిపుత్తూర్ లోని వటపత్రశాయి ఆలయంలో శ్రీ ఆండాళ్ పెరిగి ప్రేమమందిరంలో పెంచారు. తులసి వనంలో కలియుగ ఆది లో అనగా 93 సంవత్సరం లో దొరికిన తల్లి. భూమిలొ జనక మహారాజుకి సీతాదేవి లభించినవిధంగా, విష్ణుచిత్తులవారికి (పెరియాల్వార్) శ్రీవిల్లిపుత్తూర్ నందనవనంలో ఆండాళ్ ఒక తులసి చెట్టు దగ్గర లభించింది. తమిళంలో కోదై అనగా తులసి మాల అని అర్థం.. తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు. ఆపేరే గోదా గామారింది. తులసీ పరిళాలతో పూలతో ఆ తండ్రిపెంపకం లో ఆమె కృష్ణ భక్తి తో పెరిగింది. రంగనాథుడిరూపంలో ఉన్న వటపత్రశాయిని పత్నిగా భావించేవారు.

ప్రతి రోజు తులసి మాలను తయారుచేసి ఒకబుట్టలో ఉంచి తీసుకుపోయేవారు, విష్ణుచిత్తులవారు ఆ మాలను దేవాలయానికి తీసుకొనివెళ్ళి వటపత్రశాయి మూర్తికి సమర్పించేవాడు. తండ్రిగారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి రంగనాథుడిని పెళ్లాడేకి సరిపోవునా అని అద్దంలో చూసుకొని మురిసేది.ఆ పూమాలలో ఒక వెంట్రుక చూసి తప్పు జరిగిందని భావించి ఆ మాలను విష్ణుచిత్తులవారు భగవంతునికి సమర్పించలేదు. ఆరోజు స్వప్నం లో స్వామి కనిపించి ఈరోజు తులసి మాలని ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారట. గోదా ఒక కారణ జన్మురాలని తండ్రి గమనించి, నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ ఆండాళ్ అని పిలవటంవారు. ఆండాళ్ అంటే కాపాడటానికి వచ్చినది అని అర్థం.అప్పటినుండి ప్రతిరోజు ఆండాళ్ దరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవాడు. గోదాదేవికి పెళ్ళి వయసు రాగానే తండ్రి వరుని వెదికారు. కాని ఆమె కృష్ణున్ని మాత్రమే వివాహమాడుతానని పట్టు బట్టి పంతంతో చెప్పెను. కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులమనే ప్రాంతము అని అది చాలదూరము, కాలము కూడా వేరు అని కాని తండ్రి చెప్పినా ఒప్పుకోలేదు. తాను కృష్ణుడిని కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చని వివరించారు. తండ్రిగారు వివిద దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల కళ్యాణగుణగణాలను కీర్తించి తెలుసుకుని గోదాదేవి శ్రీరంగం లో వేంచేసి ఉన్న రంగనాయకులనే వివాహం పొందాలని కోరినారు. తాను శ్రీరంగనాథున్ని ప్రేమిస్తున్నాననీ, వివాహం పొందాలని వ్రతాలు పట్టించేవారు. తాను “తిరుప్పావై” వేదంత సమానమైన రచనం చేయడమే తోపాటు “నాచియార్ తిరుమొఱ్ఱి” అనే విరహ కావ్య దివ్యప్రబంధాలను రచించారు. విష్ణుచిత్తులవారికి శ్రీరంగనాథులవారు మళ్లీ స్వప్నంలో కనిపించి, నీ కుమర్తెను తనకిచ్చి వివాహం చేయటానికి చింతించవద్దని చెప్పినారనీ, ఆమె ఎవరో కాదు భూదేవేనని అన్నారనీ, శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహమునకై శ్రీవిల్లిపుత్తుర్ నుండి గోదాదేవిని పల్లకీలో తెమ్మని చెప్పినారని. ఆ దేశపు రాజు వల్లభ దేవుని తో పాటు అందరు కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తెచ్చిరి. ఆమె ఆ రంగనాథున్ని వివాహమాడి సన్నిధిలో కలిసిపోయినారు. తులసిలో కనిపించిన గోదాదేవి ఎక్కడినుంచి పుట్టినారో, శ్రీ రంగనాథుడిని కలిసిపోయినారు. ఆమె మరో సీత గోదాదేవి.

మొత్తం 12 గొప్ప భక్తులు ఆళ్వారులు లేదా అళ్వార్లు. శ్రీవైష్ణవ సంప్రాదాయంలోనూ, తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన విష్ణు భక్తులు. పణ్ణిద్దరు (పన్నెండు మంది) ఆళ్వారులు పాడిన/ రచించిన పాశురాలు ’నాలాయిర (4000) దివ్య ప్రబంధం’గా, ‘ద్రవిడవేదం’గా ప్రసిద్ధి పొందాయి.

‘‘వైష్ణవ జనాతో తేనే కహియే జే పీడ పరాఈ జానే రే వైష్ణవ జనాతో తేనే …’’ అంటూ కష్టాలను తెలుసుకునివారు వైష్ణులని మహాత్మా గాంధీ చాలా నచ్చిన భజన్ చేసేవారు.

వైష్ణవ జనాతో తేనే కహియే

జే పీడ పరాఈ జానే రే

వైష్ణవ జనాతో తేనే కహియే

జే పీడ పరాఈ జానే రే

వైష్ణవ జనాతో తేనే కహియే

జే పీడ పరాఈ జానే రే

వైష్ణవ జనాతో తేనే కహియే

జే పీడ పరాఈ జానే రే

పర దుఖే ఉపకార కరే తో యే

పర దుఖే ఉపకార కరే తో యేమన అభిమాన ఆయే రే

వైష్ణవ జనాతో తేనే కహియే

జే పీడ పరాఈ జానే రే

సగల లోక మాం సహూనే వందే

నిందా నా కరే కేడీ రే

బచ బచ మన నిశ్చల రఖే

ధన ధన జననీ దేవీ రే

వైష్ణవ జనాతో తేనే కహియే

జే పీడ పరాఈ జానే రే.

పన్నిరద్దరు ఆళ్వారులు పన్నెండు మంది ప్రసిద్ధులైన భక్త కవులున్నారు. సరోయోగి (పొయ్ గయాళ్వార్)భూత యోగి (పూదత్తాళ్వార్) మహాయోగి (పేయాళ్వార్)  భట్టనాథులు (పెరియాళ్వార్)భక్తిసారులు (తిరుమళిశయాళ్వార్)  కులశేఖరుడు (కులశేఖరాళ్వార్)మునివాహనులు (తిరుప్పాణాళ్వార్)  భక్తాంఘ్రిరేణువు (తొండరడిప్పొడియాళ్వార్)  పరకాలయోగి (తిరుమంగయాళ్వార్) మధురకవి (ఆళ్వారుక్కు అదియాన్) శఠకోపముని (నమ్మాళ్వార్) గోదాదేవి.

క్రమంఆళ్వారుజీవించిన కాలం స్థలంఇతర నామాలు,నెల, నక్షత్రంఅంశ  
1పొయ్‌గై ఆళ్వార్7వ శతాబ్దం, కాంచీపురంసరో యోగి, కాసార యోగి, పొయ్‌గై పిరాన్, పద్మముని, కవిన్యార్పోరెయెర్ఆశ్వీజం, శ్రవణపాంచజన్యం (శంఖం)
2పూదత్తాళ్వార్7వ శతాబ్దం, మైసూరుభూతాళ్వార్ఆశ్వీజం ధనిష్ఠకౌమోదకి (గద)
3పేయాళ్వార్7వ శతాబ్దం,కైరవముని, మహాదాహ్వయార్ఆశ్వీజం శతభిషంనందకం (ఖడ్గం)
4తిరుమళిశై ఆళ్వార్7వ శతాబ్దం, తిరుమళిసాయిభక్తిసారుడు, భార్గవుడు, మగిసారాపురీశ్వరర్ (మహీసార పురీశ్వరుడు), మళిసాయి పిరాన్పుష్యం మఘసుదర్శన చక్రం
5నమ్మాళ్వార్9వ శతాబ్దం, తిరునగరి (కురుగూర్)శఠకోపముని, సదారి, పరాంకుశ స్వామి, మారన్, వకుళాభరణుడు, కురిగైయార్కోనేవైశాఖ, విశాఖవిష్వక్సేనుడు సేనాపతి
6మధురకవి ఆళ్వార్9వ శతాబ్దం, తిరుకొళ్లూర్ఇంకవియార్, అళ్వారుక్కు ఆదియాన్చైత్రం చిత్రకుముద గణేశ (విష్వక్సేనుని శిష్యుడు) అని పద్మ అంశ
7కులశేఖర ఆళ్వార్8వ శతాబ్దం, తిరువంజిక్కోలమ్కొల్లికావలన్, కూదల్‌నాయకన్, కోయికోనె, విల్లివార్‌కోనె, చెయ్‌రలార్‌కోనేమాఘం పునర్వసుకౌస్తుభం మణి
8పెరియాళ్వార్9వ శతాబ్దం, శ్రీవిల్లిపుత్తూరువిష్ణుచిత్తుడు, పట్టణాదన్, బట్టార్‌పిరన్, శ్రీవిల్లిపుత్తూరార్, శ్రీరంగనాధ స్వసూరార్జ్యేష్టం స్వాతిగరుత్మంతుడు
9ఆండాళ్9వ శతాబ్దం శ్రీవిల్లిపుత్తూర్చూడికొడుత్తనాచియార్, గోదా, గోదామాతఆషాడం పూర్వఫల్గుణిభూదేవి
10తొండరాడిప్పొడియాళ్వార్8వ శతాబ్దం, తిరుమందనగుడివిప్రనారాయణుడు, తిరుమందనగుడియార్, భక్తాంఘ్రిరేణుడు, పల్లియునర్తియపిరాన్ధనుర్మాసం జ్యేష్టవనమాల (దండ)
11తిరుప్పాన్ ఆళ్వార్8వ శతాబ్దం, ఉరయూర్పానార్, మునివాహనుడు, యోగివాహనుడు, కవీశ్వరుడుకార్తీకం రోహిణిశ్రీవత్సం (చిహ్నం)
12తిరుమంగై ఆళ్వార్8వ శతాబ్దం, తిరుక్కురయూర్కలియన్, ఆలినాదన్, నాలుకవి పెరుమాళ్, అరుల్‌మారి, పరకాల స్వామి, మంగైయార్‌కోనేకార్తీకం కృత్తికశార్ఙ్గము (ధనుస్సు)

శ్రీ తిరుమంగై ఆళ్వార్ రచనలు, దివ్యదేశ వైభవ ప్రకాశిక – కిడంబి గోపాల కృష్ణమాచార్యుల రచన – ఎన్.వి.ఎల్.ఎన్.రామానుజాచార్యుల ఆంధ్ర వివరణ ఇచ్చారు. దివ్య ప్రబంధ మాధురి, ద్వాదశ సూరి చరిత్ర అనే రెండు గొప్ప గ్రంధాలను శ్రీ కె.టి.ఎల్.నరసింహాచార్యులు రచించారు. ఆళ్వారాచార్యుల సంగ్రహ చరిత్ర – పాలవంచ తిరుమల గుదిమెళ్ళ వేంకట లక్ష్మీనృసింహాచార్యులు రచించారు. (‘‘తిరుమల కొండ పదచిత్రాలు’’ పున్నా కృష్ణమూర్తి గారి ప్రచురణను సూర్య పబ్లికేషన్స్, హైదరాబాదు (2002) – ఆళ్వారుల కాలం గురించిన సంవత్సరాలు సేకరించారు.)

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles