మనిషి ఆశలు అపరిమితం
ఆశల మరో రూపం హక్కులు
వాటికి మరోవైపు బాధ్యతలు
జనం దృష్టి మాత్రం హక్కుల పైనే.
నాడు రాజరిక వ్యవస్థలో
ఎవరికీ ఏ హక్కులు లేవు
వారిలో చాలా మంది ధర్మాత్ములే
నియంతలు, సైనిక పాలకులు, కమ్యూనిస్టులు
హక్కులను మరిపించారు
బాధ్యతలనే గుర్తు చేశారు.
ప్రభువులు బానిసలను తయారు చేశారు
భూస్వాములు వెట్టి చేయించారు
నల్ల జాతీయుల, స్త్రీల హక్కులను హరించారు
కులాల పేరున ఊరి బయట పెట్టారు.
నేడు ప్రజాస్వామ్యం
అందరూ సమానం అన్నారు
కొందరికి రిజర్వేషన్లు అన్నారు
జాతి, లింగ వివక్ష కొనసాగుతున్నాయి
వాక్ స్వాతత్ర్యం అన్నారు
విమర్శ పట్ల అసహనం, ద్వేషం
బెదిరింపులు, హింస, దాడులు, కేసులు
దౌర్జన్య రాజ్యాలు విలసిల్లుతున్నాయి
మానవ హక్కులకు, మనో వికాసానికి గోరీలు కడుతున్నాయి.
నాటి జమీందారులే
నేటి పోలీసులు, అధికారులు, గుమాస్తాలు
వీరిని మించిన గవర్నర్లు ధనికులు, రాజకీయులు
డబ్బు, అధికారం న్యాయాన్ని దూరం చేస్తున్నాయి
న్యాయస్థానాలు పాదుషాల సాంప్రదాయాలు పాటిస్తున్నాయి
సామాన్యుడు వినియోగదారుడనని
మరిచి పోతున్నాడు
హక్కుల గురించి ఎలుగెత్తి అరిచే వాళ్లు
ఒక వర్గం హక్కుల కోసమే ఉన్నారు.
రాజ్యాంగం, శాస్త్రాలు, నీతి సూత్రాలు
పుస్తకాలకే పరిమితమైపోయాయి
ఏ దిక్కు లేని సగటు మనిషికి
దేవుడే దిక్కనే పరిస్థితి మారేనా
అద్వైతం అర్థం కాకపోయినా
అందరం మనుషులుగా బ్రతికే రోజొస్తుందా
దానికి మనమేం చెయ్యాలో తెలుస్తుందా
ఆశ, ఆవేశమే కాకుండా
ఆలోచన కలిగించి
ఆచరణలోకి తెచ్చే మార్గం చూద్దాం.
Also read: “ప్రేమ టూ వే”
Also read: రాజ్యాంగం
Also read: భూత దయ
Also read: “దీపావళి”
Also read: “సింధువు”