• హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి మధ్య ‘నువ్వా నేనా’ అనేవిధంగా పోటీ ఉంది – పీపుల్స్‌పల్స్
• పీపుల్స్‌పల్స్ సంస్థ నిర్వహించిన పోస్ట్‌పోల్ సర్వే ప్రకారం హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి 29-39, బిజెపికి 27-37, ఇతరులకు 2-5 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
• పీపుల్స్‌పల్స్ సంస్థ నిర్వహించిన పోస్ట్‌పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్-బిజెపి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.4 శాతం మాత్రమే ఉంది.
• పీపుల్స్‌పల్స్ పోస్ట్‌పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్‌పార్టీకి 45.9 శాతం, బిజెపికి 45.5 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 2.1 శాతం, ఇతరులకు 6.5 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ± 3 శాతం.
• ప్రియాంక గాంధీ ప్రచారం వల్ల హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరింది – పీపుల్స్‌పల్స్
• రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం హిమాచల్ ఎన్నికలపై ఏ మాత్రం లేదు – పీపుల్స్‌పల్స్
• హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 35 సీట్లు గెలవాలి.
• హంగ్ వస్తే స్వతంత్ర అభ్యర్థులు ఈ సారి హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది – పీపుల్స్‌పల్స్
• 2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 శాతం ఓట్ల తేడాతోటే కాంగ్రెస్‌పార్టీ 16 సీట్లు కోల్పోయింది. చిన్నరాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో ఓట్లశాతంలో స్వల్ప తేడా కూడా రాజకీయపార్టీల తలరాత మార్చేస్తుంది – పీపుల్స్‌పల్స్
• 1985 నుంచి ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీ తిరిగి హిమాచల్‌ప్రదేశ్‌లో గెలవలేదు. దీంతో ఈసారి మెజార్టీ ప్రజలు మానసికంగా కాంగ్రెస్ వైపు నిలబడ్డారు – పీపుల్స్‌పల్స్
• 2017 ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4.2 శాతం ఓట్లను అధికంగా పొందుతుండగా బిజెపి 3 శాతం ఓట్లను కోల్పోయే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్‌పల్స్ పోస్ట్‌పోల్ సర్వేలో వెల్లడైంది
• ఎస్సీలు ఎక్కువగా ఉండే తూర్పు హిమాచల్ లో రాష్ట్ర పరిస్థితులతో సంబంధం లేకుండా ఎప్పటిలాగే ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీ అధిక ఓట్లు సొంతం చేసుకుంటుంది – పీపుల్స్‌పల్స్
• హిమాచల్‌ప్రదేశ్‌లోని మొత్తం 68 స్థానాల్లో 38 స్థానాల్లో ప్రతీ ఎన్నికల్లోనూ ఫలితాలు తారుమారు అవుతున్నాయి – పీపుల్స్‌పల్స్
• హిమాచల్‌ప్రదేశ్‌లో అధికార బిజెపిలో 14 మంది తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉండగా కాంగ్రెస్‌పార్టీ తరుపున ముగ్గురు తిరుగుబాటు అభ్యర్థులు పోటీచేశారు – పీపుల్స్‌పల్స్
• బిజెపికి మరొకసారి అవకాశం ఇస్తారా అని అడగ్గా 48 శాతం మంది ఇవ్వమని సమాధానం ఇచ్చారు – పీపుల్స్‌పల్స్
• ప్రస్తుత ముఖ్యమంత్రి జయరామ్ థాకూర్‌కు 24 శాతం మంది, కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్‌కు 22 శాతం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్‌కు 22 శాతం మంది ఈ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు – పీపుల్స్‌పల్స్
• హిమాచల్‌ప్రదేశ్‌లోని మొత్తం 55 లక్షల ఓటర్లలో 2.7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటర్లుగా ఉన్నారు- పీపుల్స్‌పల్స్
• హిమాచల్‌ప్రదేశ్‌లో అధికార బిజెపి పార్టీపై ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా ఓ.పి.యస్ విషయంలో – పీపుల్స్‌పల్స్
• పీపుల్స్‌పల్స్ పోస్ట్‌పోల్ ప్రకారం ఈ ఎన్నికల్లో పాత పెన్షన్ పథకం- ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపిస్తుందని 53 శాతం మంది చెప్పారు.
• నిత్యావసర వస్తువుల ధరలపెరుగుదల, నిరుద్యోగం, యాపిల్‌పంటకు కనీస మద్దతు ధర, అభివృద్ధి, అవినీతి, ఓ.పి.యస్ ప్రధానమైన సమస్యలని పీపుల్స్‌పల్స్ పోస్ట్‌పోల్ సర్వేలో వెల్లడైంది.
• నిత్యావసర వస్తువుల ధరలపెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై అధికార బిజెపి పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత కారణంగానే హిమాచల్‌ప్రదేశ్‌లో బిజెపి అధికారం కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి – పీపుల్స్‌పల్స్
• హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం 2.04 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా, ఇందులో 1.76 లక్షల మంది 20 నుంచి 29 వయసు మధ్య వయసువాళ్లే ఉన్నారు- పీపుల్స్‌పల్స్
• హమిపూర్, ఉన, కంగ్రా ప్రాంతాల్లో అధికశాతం ఆర్మీ ఉద్యోగాల్లో చేరే యువత అగ్నివీర్ పథకం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ పథకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనల్లో కూడా పాల్గొన్నారు – పీపుల్స్‌పల్స్
• హిమాచల్ ప్రదేశ్ లో 41 శాతం మంది అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది.
• యాపిల్ కి కనీస మద్దతు ధర ఇవ్వడంలో విఫలమైందని, బీజేపీ పట్ల యాపిల్ రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సిమ్లా ప్రాంతంలో 18 నియోజకవర్గాల్లో యాపిల్ రైతుల ప్రభావం ఉంటుంది – పీపుల్స్‌పల్స్
• హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభావం నామమాత్రం – పీపుల్స్‌పల్స్
• పంజాబ్ ఎన్నికల్లో అధికారపగ్గాలు చేపట్టిన ఆమ్‌ఆద్మీ పార్టీకి, హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు – పీపుల్స్‌పల్స్
• హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కి క్షేత్రస్థాయిలో నెట్వర్క్ లేదు- పీపుల్స్‌పల్స్
• సాంప్రదాయంగా సిమ్లా కాంగ్రెస్ కి అనుకూలం. దీనికితోడు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో యాపిల్ రైతులకు పెద్దపీట వేసింది – పీపుల్స్‌పల్స్
• హిమాచల్ ప్రదేశ్ లో గత ఐదేళ్ల బీజేపీ పాలన పట్ల 26 శాతం మంది తీవ్ర అసంతృప్తి చేయగా, 28 శాతం మంది కొంత మేరకు అసంతృప్తి ఉందని చెప్పారు. కేవలం 22 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు – పీపుల్స్‌పల్స్
• బీజేపీ ప్రభుత్వంతో పోలిస్తే అంతకముందు ఐదేళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందని 37 శాతమంది చెప్తే, 31 శాతం మంది ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. – పీపుల్స్‌పల్స్
• తమ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుస్తారని 44 శాతం మంది, బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని 43 శాతం మంది చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి 2 శాతం మంది సానుకూలంగా చెప్పారు. – పీపుల్స్‌పల్స్
• ధరల పెరుగుదల విషయంలో బీజేపీ పట్ల హిమాచల్ ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ధరల పెరుగుదలకు కారణం కేంద్ర ప్రభుత్వమే అని 24 శాతం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కారణమేనని 45 శాతం మంది నమ్ముతున్నారు. – పీపుల్స్‌పల్స్
• హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని 45 శాతం, బీజేపీ రావాలని 42 శాతం మంది రావాలని కోరుకుంటున్నారు. – పీపుల్స్‌పల్స్
• కాంగ్రెస్ పార్టీ తమ మెనిఫెస్టో అమలు చేస్తుందని 38 శాతం మంది, బీజేపీ తమ మేనిఫెస్టో అమలు చేస్తుందని 35 శాతం మంది నమ్ముతున్నారు. – పీపుల్స్‌పల్స్
• ముఖ్యమంత్రి జైరామ్ థాకూర్ పనితీరు పట్ల 33 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, 29 శాతం కొంత అసంతృప్తితో ఉన్నారు – పీపుల్స్‌పల్స్
• ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ఉన్న అభిమానం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని 42 శాతం మంది చెప్పారు – పీపుల్స్‌పల్స్
• బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్ హిమాచల్ ప్రదేశ్ నాయకులు కావడం వల్ల మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు – పీపుల్స్‌పల్స్
• తిరిగి అధికారం పొందడమే లక్ష్యంగా స్టార్ క్యాంపెనర్ గా అనేక బహిరంగ సభల్లో పాల్గొన్న మోదీ, హిమాచల్ ప్రదేశ్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. – పీపుల్స్‌పల్స్
• డ్రగ్ పార్క్ కి శంకుస్థాపన, అంబ్ అందౌరా- ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం, ఉనలో ట్రిపుల్ ఐటీ, బిలాస్ పూర్ లో ఎయిమ్స్ తో పాటు రోడ్లు, పలు జల విద్యుత్ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు – పీపుల్స్‌పల్స్
• ఈ అభివృద్ధి పనులన్నీ డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే సాధ్యమైందని మోదీ ప్రజల మనసుల్లో నాటే ప్రయత్నంలో ఆయన కొంతవరకు సఫలమయ్యారు – పీపుల్స్‌పల్స్
• పార్టీల్లో రెబల్స్, అక్కడక్కడ ఆమ్ ఆద్మీ ప్రభావం వల్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్జుల్లో అధికా శాతం మంది స్వల్ప మెజారిటీతో నెగ్గుతారు. – పీపుల్స్‌పల్స్
• హిమాచల్‌ప్రదేశ్‌లో పీపుల్స్‌పల్స్ సంస్థ పోస్ట్‌పోల్ సర్వేను నవంబర్ 15 నుంచి నవంబర్ 22 వరకు 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 96 పోలింగ్‌స్టేషన్లలో నిర్వహించి, మొత్తం 1920 శాంపిల్స్‌ను సేకరించింది.