Monday, November 25, 2024

భూత దయ

చిన్నప్పుడు ప్రైమరీ స్కూలు గోడలపైన “భూత దయ కలిగి ఉండవలెను” లాంటివి రాసి ఉండేవి. భూతాల మీద మనం ఎందుకు దయ చూపించాలో  అర్థం కాలేదు. అడిగితే జంతువుల పట్ల జాలి చూపించడం అన్నారు. ‘భూత’ అంటే ‘ప్రాణి’ అన్న అర్థం తెలియదు అప్పుడు. సాటి మనుషులపైన, పశువులు, చెట్లు, పంచ భూతాలనబడే  గాలి, నీరు వగైరాలన్నిటి పట్ల ప్రేమ, కరుణ, దయ కలిగి ఉండాలని అప్పుడు తెలియదు. అవన్నీ ప్రాణులుగా భావించ బడ్డాయి హిందూ మతంలో. అది మనం పాటించి ఉంటే నేడు సమస్యలుగా మారిన జల, వాయు, శబ్ద వగైరా కాలుష్యాలు ఉండేవి కాదేమో.

Also read: “దీపావళి”

జంతు బలుల పట్ల విముఖతతో ‘అహింస’ అన్న బౌద్ధం కంటే హిందూ మతం చెప్పే ‘భూతదయ’ మరింత లోతైన కారుణ్య భావన.

Also read: “సింధువు”

దయ, కరుణ, సానుభూతి, అహింస, ప్రేమ అన్నీ పర్యాయ పదాలే. భక్తి కూడా దేవుడిపై ఇష్టమేగా.

Also read: “హంతకులు”

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles