- మతప్రచారకులకు గౌరవవేతనం ఇవ్వటం రాజ్యాంగ విరుద్దం
మనది లౌకిక దేశం. దేవుడు, మతము వ్యక్తిగతంగానే ఉంచుకోవాలి తప్ప ప్రభుత్వపరంగా ప్రోత్సహింసకూడదు. ప్రచారచెయ్యరాదు. ఫాస్టర్లకీ, అర్చకులకూ, ముల్లాలకూ ఈ రకమైన వేతనాలు ఇవ్వకూడదని, అలాచెయ్యటం రాజ్యాంగవ్యతిరేకం అని హేతువాదసంఘం మొదటినుండి చెప్తూనే ఉంది. కానీ ప్రభుత్వాలు రాజకీయ లబ్ది పొందేందుకు, రాజ్యాంగసూత్రాలను తుంగలో తొక్కి ఫాస్టర్లకూ, ముల్లాలకు ఇలా గౌరవవెతనం ఇస్తోంది.
Also read: నవంబరు10 అంతర్జాతీయ సైన్సు దినోత్సవం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫాస్టర్లకు గౌరవవెతనం ఇవ్వటం ఏమిటని ప్రభుత్వాన్ని గురువారం ప్రశ్నించటం అభినందనీయం. ఇది ప్రభుత్వానికి ఒకచెంపపెట్టు కాగలదు. గతంలో 2021 లోఫ్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబరు 52 ను తక్షణమె రద్దుచేయాలి. పన్నుల రూపంలో వసూలుచేసిన ధనాన్ని ప్రజోపయోగం కొరకు మాత్రమె ఉపయోగించాలి.
అంతేకాదు మంత్రులు, అధికారులు అధికారకంగా కనబడ్డ అడ్డమైన బాబాల ఆశ్రమాలకు, గుళ్లకు వెళ్లటం కూడా రాజ్యాంగవిరుద్దమే.
వెళ్లాలనుకుంటే సెలవుపెట్టుకొని సొంతడబ్బుతొ మాత్రమే వెళ్ళాలి.
Also read: ఆం.ప్ర. ముఖ్యమంత్రి ప్రకటనలు కేవలం ఉడత ఉపులేనా?
ఈ రొజు ఎవరూ అడిగేవారు లేరని ప్రధాని మొదలుకుని అందరూ రాజ్యాంగవిరుద్దంగానే ప్రవర్తిస్తున్నారు.
గతంలొ శంకర్ దయాల్ శర్మ మన గవర్నరుగా ఉన్నపుడు, ఈమధ్య గవర్నరుగా పనిచేసిన నరసింహన్ కూడా ఇద్దరు మాట్లాడితే గుళ్లకు వెళ్లేవారు. ప్రభుత్వపరంగా మత ప్రచారం కొరకు, దేవుళ్లకు, బాబాల ఆశ్రమాలకు ఏరకమైన ప్రజాధనం ఉపయోగించరాదు.
ఈమధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలోని శారదా పీఠం స్వరూపానందకు 50 ఎకరాల ప్రభుత్వభూమిని, అందునా చదునుచేసి ఇవ్వాలనుకోవటం చాలా సిగ్గుచేటైన విషయం. తక్షణమె ఈరకమైన జీవోలను విరమించుకోవాలి.
అంతేకాదు, నెల్లూరి జిల్లాలో గుడ్లూరు మండలం చేవూరులో ఒక దొంగస్వామి చెరువు భూమిని అక్రమించి అశ్రమం పేరుతో మోసంచేస్తున్నాడు. తిరపతి జిల్లాలో వరదయ్యపాలెం వద్ద కల్కి అని ఒక దొంగబాబా ప్రభుత్వ భూమిని ఆక్రమించి గొల్డెన్ టెంపుల్ నిర్మించాడు.
అలాగె అమరావతి కరకట్టమీద ఉన్న ఆశ్రమాలు అన్ని ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టినవే. మరి ప్రమాణముచేసిన రెండోరోజే అమరావతి కరకట్టమీద ఉన్న ప్రజా వేదికను కూల్చిన ముఖ్యమంత్రి దొంగబాబాలు ఆక్రమించిన భూములను కూడా వెంటనె స్వాధీనము చేసుకోవాలి.
Also read: జీవితంలో వెలుగులు నిండుతాయనే మూఢనమ్మకంతో కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి
అందునా సంవత్సరంన్నర క్రితమే ప్రిన్సిపల్ సెక్రటరి రెవిన్యూ డిపార్టుమెంటు నెల్లూరు జిల్లాలో చేవూరు దొంగస్వామి ఆక్రమించిన భూమిని స్వాదీనం చేసుకొవాలని కలెక్టరుకి అదేశం ఇచ్చింది. ఇంతవరకు అతీగతిలేదు. అధికారులు దున్నపోతుమీద వర్షం పడిన చందంగా వ్యవహరిస్తున్నారు.
కనుక ఇప్పటికయినా ముఖ్యమంత్రి అర్చకులకు, ఫాస్టర్లకు, ముల్లాలకు వేతనాల జీవోను ఉపసంహరించుకొని, దొంగబాబాలు ఆక్రమించిన భూములను స్వాదీనం చేసుకోవాలి.
Also read: ఇంకా ఎంత మంది బాబాల మోసాలకు బలికావాలి?
నార్నెవెంకటసుబ్బయ్య
ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షులు