- రాష్ట్రంలో అధికారులు పనిచేస్తున్నారా.?
- అధికారు లపై కొరడా ఝలిపించండి
- హేతువాది నార్నె వెంకటసుబ్బయ్య విజ్ఞప్తి
నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలములోని చేవూరు చెరువు పొరంబోకు భూమి సర్వేనంబరు 879 లొని కోట్లాదిరూపాయల విలువగలిగిన ప్రభుత్వ భూమిని రామదూత అనే ఒకదొంగస్వామి ఆక్రమించి, అశ్రమం పేరుతో రకరకాలుగా మోసంచేస్తున్నకారణంగా, హేతువాద సంఘం లోకాయుక్తలో కేసువేసిన కారణముగా, ప్రిన్సిపల్ సెక్రటరి, రెవిన్యూ డిపార్టుమెంటు వారు 25/5/2021 నాడు ఆక్రమణ భూమిని స్వాదీనం చేసుకొవాలని జిల్లా కలెక్టరుకి మెమో ఇచ్చి సంవత్సరం ఎనిమిది నెలలు గడచింది. అధికారులు దున్నపోతుమీద వర్షం పడిన చందంగా, బాధ్యతారహితంగా, నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు స్వాధీనము చేసుకోలేదు.
Also read: జీవితంలో వెలుగులు నిండుతాయనే మూఢనమ్మకంతో కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి
గుడ్లూరు తహసీల్దారుని , జిల్లా కలెక్టర్ ని సస్పెండ్ చెయ్యాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి లెటర్ వ్రాయడం జరిగింది. లోకయుక్త వారిని ధిక్కరణ క్రింద అధికారాలపై చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది.
ముఖ్యమంత్రి ఒకప్రక్క మా ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది, పారదర్శకంగా పనిచేస్తుంది అని చెప్పుకోవటమేకాని, పనిచేయని అధికారులమీద చర్యలు లేనికారణంగా, ప్రిన్సిపల్ సెక్రటరి ఆదేశాలకే గతి లేదు. లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ ప్రిన్సిపల్ సెక్రటరి అదేశాలకే గతిలేకపోతే ….ఇంకా ఫ్రభుత్వం ఎక్కడ పని చేస్తున్నట్లు?
ఓముఖ్యమంత్రి గారూ, మీప్రకటనలు కేవలం ఉడత ఉఫుల్లాగానే తయారైనాయి. కనుక తక్షణమె అధికారులచేత పని చేయించండి. ఆదేశాలను అమలుపరచని అధికారు లపై కొరడా ఝులిపించండి.
Also read: ఇంకా ఎంత మంది బాబాల మోసాలకు బలికావాలి?
నార్నెవెంకటసుబ్బయ్య
అద్యక్షుడు, AP హేతువాద సంఘం.