మొన్న దీపావళి వెళ్లిన మరుసటిరోజు ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూషేష్ భఘేల్ తనకు జీవితంలో వెలుగులు నిండుతాయని దుర్గ్ జిల్లాలొ జరిగిన ఒక పండగ కార్యక్రమంలో కొరడా దెబ్బలు తిన్నాడు.
ఒక మనిషి జీవితంలొ ముఖ్యమంత్రి పోస్ట్ కంటే ఇంకా ఏమి వెలుగులు నింపే పోస్టు వస్తుంది?
Also read: సూర్యగ్రహణాన్ని ఆహ్లాదకరంగా చూడండి
ప్రధానమంత్రో లేక రాష్ట్రపతో కావాలేమో!
చెప్పుతో కొట్టించుకుంటే జీవితంలొ వెలుగులే వెలుగులు అని ఎవరయినా చెపితే చెప్పుతో కూడా కొట్టించు కుంటాడేమో?
ఇలాంటి మూఢనమ్మకాలున్న వ్యక్తులు ముఖ్యమంత్రులుగా అయితే సమాజం ఏమి బాగుపడుతుంది?
తల తెగిపోయిన వినాయకునికి, ఏనుగు తల అతికించటాన్ని సమర్ధించిన ప్రధానమంత్రి ఉన్న దేశంలో, కొరడాదెబ్బలుతింటే జీవితంలో వెలుగులు నిండుతాయి అనుకునే ముఖ్యమంత్రి ఉండటంలో ఆశ్చర్యంలేదు!
Also read: ఇంకా ఎంత మంది బాబాల మోసాలకు బలికావాలి?
మొన్నీమద్య ఢిల్లీలో అధికసంపద వస్తుందని ఒక బాలున్ని బలి ఇచ్చారు.
అదే రకమైన ఆశతో కేరళలో ఇద్దరు మహిళను నరికిచంపి తిన్నారు.
పరలోక ప్రాప్తికోసం ఎవడొ ఫాస్టర్ చెప్పాడని ఆ మధ్య తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు మహిళలు ఉరివేసుకుని చనిపోయారు.
తమిళనాడులొ ఒకడు ఆత్మను చూడటానికి ఇద్దరు వ్యక్తులను చంపాడు.
Also read: రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న కెసిఆర్
ముఖ్యమంత్రి పదవిలోఉన్న చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రికి, పైన పేర్కొన్న వ్యక్తుల ఆలోచనలకు తేడా ఎమిలేదు. మూఢ నమ్మకాలకు పదవులు అడ్డురావు.
“తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు …జేరి
“మూర్ఖుల మనసు రంజింపలేము”
” ఎలుక తోలు తెచ్చి ఎంతెంత ఉతికినా నలుపు నలుపేకాని తెలుపురాదు”
కుక్కతోకకు రాయికట్టినా దాని వంకర పోదు అన్నట్లుగా …..
ఎంతపదవులు అలంకరించినా కూడా వారి మూఢ నమ్మకాలు పోవు అనేదానికి ఇవన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
హేతుబద్ధమైన అలోచన, హేతువాద ఉద్యమం ఆవశ్యకత ఈ సమాజానికి ఎంతో అవసరం ఉంది.
Also read: పాత పునాదులను తొలగించి పటిష్టంగా నవసమాజ నిర్మాణం
నార్నెవెంకటసుబ్బయ్య
అద్యక్షుడు, AP .హేతువాదసంఘం.