చంద్రవంక మసక వెలుతురులో
ఊరికి దూరంగా మైళ్ల నడక
మిత్రులతో మాటా మంతీతో
ఎండిన కాలవ గట్ల మీద
ఇసుక తెన్నెల్లో వెల్లకిలా పడుకొని
చంద్రుడిని చూస్తూ ఎన్నో భావాలు పంచుకుంటూ
గడిపిన రోజులు ఏమయ్యాయో
ఇప్పుడు చంద్రవంకను చూస్తే
ఆకాశం కూడా ఆకుపచ్చగా కనిపిస్తూంది.
పచ్చని పొలాల మధ్య నడుస్తూ
పురుగు పుట్ర భయం లేకుండా
పక్కనున్న మొక్కల్ని తాకుతూంటే ఆనందం
పొలంలో పనిచేసే ఆడవాళ్ళ చేతుల్లో కొడవళ్ళు
చంద్రవంకల్లా మెరిసి పరవశింప జేసేవి
మరి ఇప్పుడు కొడవళ్లను చూస్తే
కంకులు, సుత్తులు మెరుస్తున్నాయి వాటి మధ్య
బాంబులు, క్షిపణుల పేలుళ్లు వినిపిస్తున్నాయి.
ఎంతలో ఎంత మార్పు
అంతా మన మంచికేనా?
చూస్తూ ఊరుకుందామా!
Also read: మహర్షి
Also read: “మహిళ”
Also read: “యుగ సామ్రాట్ గురజాడ”
Also read: ‘‘శాంతి’’
Also read: “కర్మ భూమి”