Sunday, December 22, 2024

లోక్ మత్ యజమానితో కేసీఆర్ భేటీ

మహారాష్ట్ర రాజకీయ నాయకుడు,  రాజ్యసభ మాజీ సభ్యుడు, ‘లోక్ మత్’ మీడియా సంస్థల చైర్మన్., విజయ్ దర్డా’ గురువారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు.

తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి తీరుతెన్నులతో పాటు, పలు జాతీయ అంశాలు, దేశ రాజకీయాలపై కెసిఆర్ తో దర్డా’ చర్చించారు. కేంద్రంలోని బిజెపి అసంబద్ధ పాలనతో రోజు రోజుకూ అన్ని రంగాలు దిగజారిపోతున్నాయని,   సామాజిక సంక్షుభిత వాతావరణం నెలకొంటున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రతిష్టను దిగజార్చే ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దే ప్రత్యామ్న్యాయ రాజకీయ నాయకత్వం దేశానికి తక్షణావసరమని చర్చల సందర్భంగా విజయ్ దర్డా స్పష్టం చేశారు.

శాంతియుత పార్లమెంటరీ పంథాలో ఉద్యమాలు నిర్వహించి, సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం గొప్ప విషయమని విజయ్ దర్దా అన్నారు. అక్కడే ఆగిపోకుండా, అనతికాలంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టి దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిదుతున్న తీరు అమోఘమన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ అకుంఠిత దీక్షను,  సుపరిపాలనను ఆయన కొనియాడారు. ఇంతటి పట్టుదల, ధైర్యం, రాజనీతిజ్జత, దార్శనికత కలిగిన రాజకీయ నాయకత్వం సమకాలీన రాజకీయాల్లో తెలంగాణనుంచి ఎదగడం దేశానికి శుభ సూచకమని  అభిప్రాయపడ్డారు. కెసిఆర్ రాజకీయ పాలనానుభవం కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా, దేశ ప్రజల గుణాత్మాకాభివృద్ధికి దోహదపడాల్సిన అవసరమున్నదన్నారు. ‘కేసీఆర్ ’ లాంటి  ప్రత్యామ్న్యాయ  నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని, జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని సిఎం కెసిఆర్ ను విజయ్ దర్డా ఆహ్వానించారు. అందుకు కెసిఆర్ విజయ్ దర్దాకు ధన్యవాదాలు తెలిపారు. ఆయనను శాలువాతో సత్కరించి, జ్జాపికను అందచేశారు.  తాను రచించిన ‘రింగ్ సైడ్ ’ పుస్తకాన్ని కెసిఆర్ కు విజయ్ దర్డా ఈ అందజేశారు. దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిగాయి.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles