————————–
(‘FINDING GOD’ FROM ‘THE WANDERER’ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం:డా. సి. బి. చంద్ర మోహన్
44. సంచారి తత్త్వాలు
——————————–
ఇద్దరు వ్యక్తులు ఒక లోయలో నడుస్తూ వెళుతున్నారు. వారిలో ఒకతను వేలును కొండవైపు చూపిస్తూ ఇలా అన్నాడు.” ఆ ఆశ్రమాన్ని చూశావా? ఎప్పుడో ఈ లోకానికి విడాకులిచ్చిన ఒక పెద్ద మనిషి అక్కడ నివసిస్తూ ఉంటాడు. ఆయన దేవుని అన్వేషణలో ఉంటాడు. అతనికి ఇంకేమీ అవసరం లేదు. “
రెండో వ్యక్తి ఇలా అన్నాడు.” ఆ ఆశ్రమం, ఒంటరితనం వదిలి మన లోకంలోకి వచ్చి, మన ఆనందాలూ, బాధలూ పంచుకుంటే తప్ప, వివాహ విందుల్లో మన నాట్యకారులతో నాట్యం చేస్తూ ఆనందిస్తే తప్ప, చనిపోయిన వారి శవ పేటికల వద్ద దుఃఖించే వారితో కలిసి దుఃఖిస్తే తప్ప — ఆయన దేవుణ్ణి కనుగొనలేడు.”
మొదటి వ్యక్తి ఆ రెండో వ్యక్తి చెప్పిన మాటలు అంతరంగంలో ఒప్పుకున్నాగానీ, ఇలా జవాబిచ్చాడు.
” నువ్వు చెప్పినది సబబే. కానీ ఆ సన్యాసి మంచి మనిషి. మంచిగా ఉన్నట్లుగా కనబడే చాలా మంది మనుషులకన్నా, నిజంగా మంచి మనిషి ఐన ఒక వ్యక్తి మన మధ్య లేకుండా చేసే మంచి ఎక్కువ కాదా?
Also read: డెభ్భై ఏళ్ళు
Also read: ప్రార్థన
Also read: నీడ
Also read: శాంతి ఒక అంటు వ్యాధి
Also read: మంచి — చెడు