మరపురాని మహాద్భుతం – మహాపండిత్ రాహుల్ సాంకృత్యాయన్.
ఏప్రిల్ 9 న కాకినాడ లో జరిగిన ఒక అద్వితీయ సమావేశం. మొత్తం యావత్ దేశంలోనే ఆ తరహా అరుదైన సమావేశం రాహుల్జీ జీవితం, కృషికి సంబంధించి జరగడం ఒకెత్తయితే దక్షిణాదిలో నాకు తెలిసీ రాహుల్జీ కోసం అంతటి సమావేశం జరగడం అనేది ఒక అపురూపమైన రికార్డు!
రెండు తెలుగు రాష్ట్రాలలో నుండి ఎంతో మంది స్వచ్ఛందంగా పాల్గొన్న ఆ సమావేశానికి రమారమీ 300 పై చిలుకు ఆలోచనాపరులు వివిధ ప్రాంతాల నుండి రావడం, అందులో అత్యధిక మంది చివరి వరకు ఉండి, అన్ని ఉపన్యాసాలు శ్రద్ధగా వినడం సంతోషకరం. ఆ సందర్భంగా ప్రసంగాలన్నీ యూట్యూబ్ లో అందు బాటులోకి తీసుకురావడం జరిగింది!
రాహుల్జీ సాంస్కృతిక సమాఖ్య సారధ్యంలో నిర్వహించిన ఆ విశిష్ట సమావేశాన్ని పురస్కరించుకుని రాహుల్జీ గురించిన పాతిక విలువైన వ్యాసాలతో ప్రచురించిందే, “ఒకేవ్యక్తి – అనేక జీవితాలు” అనే విశిష్టమైన వ్యాస సంకలనం, 152 పేజీలతో, ప్రత్యామ్నాయ సాంస్కృతిక సమాఖ్య తరపున రాహుల్జీ అభిమానులు భద్రపరుచుకుని తీరవలసిన గ్రంథంగా, అందంగా రూపుదిద్దుకున్న అమూల్యమైన పుస్తకం ఇది!
అనేకమంది మిత్రులు, శ్రేయోభిలాషులు, పుస్తకం పూర్తిగా చదివి వెనువెంటనే స్పందించి అభినందించిన విమర్శకులు, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కాస్త ఆలస్యంగా అయినా ఆ అమూల్యమైన గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందించడం కోసం సాఫ్ట్ కాపీ రూపంలో ఔత్సాహికులకు పంపించడం జరుగుతుంది. ఆర్థిక సౌలభ్యం ఉన్న మిత్రులు స్వచ్ఛందంగా మాకు సహకరిస్తే సంతోషం. విమర్శలకు ఆహ్వానం!
https://www.sakalam.in/wp-content/uploads/2022/08/Rahuljee-Writings-Book-Final-55.pdf
-గౌరవ్