పడగు పేకల కదలికలతో నేత
భారత జాతికి వస్త్రాలు ప్రసాదించిన నేత
స్త్రీ జాతి కలల వస్త్రాల నేత
అగ్గిపెట్టెలో పట్టే జరీ చీరల నేత
ఉంగరంలో దూరే అరటిబోదెల చీరల నేత
అపారంగా పండే పత్తిలో
గింజను వేరు చేసే యంత్రం లేక
అ యంత్రాలున్న ఆంగ్ల దేశానికి
తెల్ల దొరలు ఓడల్లో దాటిస్తుంటే
గుడ్లప్పగించి చూస్తూ నిలబడి
తిరిగి వచ్చిన మిల్లు బట్టల పోటీతో
బతుకులు తెల్లవారిన తరువాత
వాడవాడలా వెలసిన నేతన్నలు
కనుమరుగై అక్కడక్కడా మిగిలారు.
ప్రభుత్వ సహాయం నామమాత్రం ఉన్నా
కడుపు నిండే పరిస్థితి కొత్తమందికే నన్నా
గాలి చొరబడని నైలాన్ టెర్లిన్ బట్టలు
ఎగుమతి కోసం తయారైన మిల్లు బట్టలు,
దిగుమతైన విదేశీ బట్టలు మాని
ఉష్ణ ప్రాంతానికి తగిన నేత బట్టలు వాడితే
సంప్రదాయ వృత్తి ఒకటి చచ్చి పోకుండా మిగులుతుంది.
Also read: “స్వాతంత్ర్య భారత చిత్రం”
Also read: విశ్వరాధరికం
Also read: “హరే కృష్ణ” – సమీక్ష
Also read: లాజిక్
Also read: “తెలుగు”