Saturday, November 23, 2024

ప్రపంచ అద్భుత భర్తలు (World’s Wonderful Husbands)-9

మాధవ్ ఆర్య…. ఒక మేధావి గా అధ్యయనం చేస్తే దృష్టికి వచ్చిన క్రమాన్ని ప్రాతిపదికగా చేసుకొని శాస్త్రీయంగా ఆలోచిస్తే .. అది పూర్తిగా వ్యక్తిగత విషయం. వారిద్దరి మధ్య మానసిక బంధం ఉన్నది. స్వభావాలను జోడించి అప్పటి సామాజిక, సాంస్కృతిక రంగాలను దృష్టిలో పెట్టుకోవాలి. అందరినీ వేలెత్తి చూపినట్లు గొప్పనాయకులను వేలెత్తి చూపలేము. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన దేశం. ఉపనిషత్తులలోనే ఉంది .. జీవితం అంటే ఏమిటి? అని. ఇప్పటికీ తత్వవేత్తలు / మేధావులు అడుగుతున్నది కూడా అదే. జీవితం అంటే నిర్వచించమని చావుకు అర్ధం ఉన్నదా ? అని మరో ప్రశ్న? మరి ఆత్మ ఉన్నదా ? భౌతిక అవసరాలను తీర్చుకోవటం ఒకటి, అంతః సౌందర్యాన్ని ఆస్వాదించటం మరొకటి. ఒకరు దేశ సేవకోసం సన్యాసం పుచ్చుకున్నారు. మరొకరు దూరమునుండి భర్తను చూసుకొని ఆనందం పొందుతున్నారు. ఎవరి దారి వారికీ ఉన్నది. ఎవరు ఎవరిని భాదించారు? ఎవరు ఎవరిని నియంత్రిచారు? భార్య భర్తల సంబంధం ఒక ‘ఆధ్యాత్మిక సంబంధం’ గా భావించారు. వారిద్దరిమధ్యన ఉన్న ‘వివాహ బంధం’ వారికి అడ్డుగా, ఇబ్బందికరమైనదిగా, బాధపెట్టేదిగా, మోసంగావారిద్దరూ అనుభూతి పొందలేదు. కొత్త ప్రాపంచిక దృక్పధంను ఏర్పరచుకొని. విలువలుఅంటే… భార్య భర్తలు కలిసి లేకపోయినప్పుడు, చట్టప్రకారంగా విడిపోతేనే ఉన్నట్లు కాదు. విలువలు అంటవిలువలే. వీటికి కొలమానం ఏముంటుంది? భౌతిక అవసరాలు, శారీరక అవసరాలు ఏ విధంగా తీర్చుకుంటారు అనేది అందరికి కలిగే ఒక సందేహం. ఆహార ఉత్పత్తి జరగని రోజులలో ఏరుకొని తినేవాళ్ళం.ఇదీ అంతే. ఆధ్యాత్మికంగా నియంత్రించుకుంటారు. ఆధ్యాత్మికతకు దేశం గొప్ప నిలయం అని ప్రపంచం మొత్తం కీర్తిస్తుంది.
Also read: ప్రపంచ అద్భుత భర్తలు (World’s most wonderful husbands) – 8
వైరుధ్యాలు సహజం. వైరుధ్యాలు శాస్త్రీయంగా ఉన్నాయా ? లేవా ? అనేది ముఖ్యం. ఒక కథ ఉంది చెపుతాను.కథ ఇక్కడ చెప్పటం సముచితం అని భావిస్తున్నాను ..ఒక సైనికుడు ఒక దేశభక్తుణ్ణి రక్షించారు. ఇది తెలుసుకున్న ఆ దేశభక్తుడి భార్య సైనికుడిని కలిసి ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ఆ సైనికుడిపైన ఆరాధన పెంచుకుంటది. ఆవిడకు మానసులో సైనికుడిపై ” ప్రేమ శృంగారం” గాఢంగా అలుముకుంది. చివరికి సైనికుడిని అడిగింది .. దేశభక్తుడిని వదిలేసి తనతో వస్తానని. సైనికుడు ‘దేశభక్తుడి గౌరవం’ కు భంగం కలుగుతుందని ఆవిడకు నచ్చచెప్పాడు. సైనికుడికి ఆమె మీద మనసు కలగలేదా ? అని ప్రశ్న. భర్త ఉన్నప్పటికినీ సైనికుడితో ఎందుకు లేచిపోవాలని ఆవిడ అనుకున్నది. వీటికి జవాబులు ఎన్నో రకాలుగా, విధాలుగా చెప్పవచ్చు. వాస్తవం ఆ ఇద్దరికే తెలుసు. మనం వారు చెప్పిన దానిపైన ఆధారపడి “తీర్పు” చెపుతాము. తీర్పు చెప్పేటప్పుడు విశాల దృక్పధంతో పాటు, వైజ్ఞానిక శాస్త్రీయ దృక్పథంతో అన్ని కోణాలలో విషయమును క్రోడీకరించి, వడగట్టి చెప్పాలి. జీవిత ప్రయాణంలో ఒక సంఘటన భిన్నమైన వ్యక్తులకు, భిన్నమైన అనుభవాలను అనుభవంలోకి తెస్తుంది. ఒక్కోసారి ‘అయ్యో ! పొరపాటు గా అర్ధం చేసుకున్నాను’ అనుకున్న సందర్భాలు అందరిలో ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చి ఉండాలి.
Also read: ప్రపంచ అద్భుత భర్తలు (world wonderful husbands)-7
అతను భార్యకు విడాకులు ఇవ్వకుండా, కలిసి జీవించకుండా ఏం పట్టనట్లు తన పని తాను ఎలా చేసుకుంటున్నారు? అని అందరిలో ఉన్న ప్రశ్న. అతను ఈ పరిస్థితులలో ఎలా ఉన్నారు? అని మరో ప్రశ్న. భార్య ఎలాంటి ఫిర్యాదూ ఇవ్వలేదు. ఎక్కడా వ్యతిరేకమైన విషయాలను ప్రస్తావించలేదు. ఎవరి పనులలో వారు బిజీగా గడుపుతున్నారు. వారు “సన్యాసం”కు ఇచ్చుకున్న అర్ధం అది. అయితే సన్యాసం తీసుకోవటం అంటే రెండు పద్దతులలో ఏదో ఒక పద్దతిని స్వీకరించుకోవటము (1) ఎరేమిటికి సన్యాసులు లేదా ‘సన్యాసులు’ కేవలం ఒక గుడిసె లేదా గుహసె లాంటి ఆశ్రమంలో ఒంటరిగా నివసించేవారు (2). సెనోబిటిక్ సన్యాసులు లేదా ‘సెనోబైట్స్’ ఒకటి లేదా అనేక భవనాల సముదాయాలతో కూడిన మఠాలలో / ఆశ్రమాలలో కలిసి నివసించేవారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి వారు పాటించట్లేదు. కాబట్టి మతపరమైన “సన్యాసం” ను స్వీకరించినారు అని వారి గురించి తెలుసుకోవాలనే కోరికను కలిగిన ఔత్సాహికులు అనుకోవాలి. మత ధర్మ ఆచారాల ప్రకారం వారిద్దరి మధ్యన వైవాహిక జీవితపు “బంధం” ఉంది. భార్యను హింసించినట్లు, బంధించినట్లు, ధర్మ విరుద్ధంగా ఉన్నట్లు ఎలా నిరూపణ అవుతుంది? అది వారి ఇష్టం. వ్యక్తిగత విషయాలలో ఎలా జోక్యం చేసుకుంటారు? వారి జీవన శైలి ఎవరికి అవరోధం ఉన్నట్లు? వ్యక్తిగత చట్టాలు సాధనలోనే ఉన్నాయి. వారివారి మత ఆచారాల ప్రకారమే మహిళలు జీవిస్తున్నారు. నేడు ఒక మతాచారం నచ్చకపోతే “ఆ మతం మార్చుకొని’’ ఇంకో మతంను స్వీకరించుకునే వెసులుబాటు, హక్కు ఉంది. కాబట్టి గొప్పనాయకుడు చేసింది తప్పు కాదు. అతను ఆమెకు అద్భుతమైన మహా అద్భుతమైన భర్త అనే చెప్పాలి. ఆమెకు, దేశానికి గొప్ప నాయకుడితో వచ్చే నష్టం ఏం లేదు. జీవితాన్ని అర్ధం చేసుకోవడం వల్లనే వారిద్దరూ దూరంగా ఉండి జీవిస్తున్నారని నా అభిప్రాయం.
Also read:ప్రపంచ అద్భుత భర్తలు (World Wonderful Husbands)-6
మురారి .. ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా ఇది ఒక అనైతిక చర్య గా భావిస్తున్నాను. పవిత్రమైన శీలంను కలిగి ఉండాలి, ఒక్క సారి పెళ్లి అయిపోయాక ఆ భర్త, ఆ భార్య ఎలాంటి వ్యక్తి అయినా భరించాలి అనుకోవటం లో ఉన్న మూర్ఖత్వం మరీ దేనిలోనూ లేదు. ధర్మం న్యాయం చట్టం ల గురించి రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. నా మిత్రుడు ఎప్పుడూ ఒక విషయం చెపుతూ ఉంటాడు. అదిప్పుడు మీకూ చెపుతాను .. ఇద్దరు స్నేహితులు / పరిచితులు ఉంటారు. ఇద్దరిలో ఒకతనికి డబ్బు చాలా అవసరం ఉంది. రెండవ వ్యక్తిని డబ్బు అడిగి అప్పుగా తీసుకున్నాడు. రెండవ వ్యక్తి అకస్మాత్తుగా అనారోగ్యం పాలు అయ్యాడు, లేవలేని స్థితి. డబ్బు అవసరం ఉంది. రెండవ వ్యక్తి భార్య మొదటి వ్యక్తి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని అడిగింది. మొదటి వ్యక్తి తప్పించుకోని తిరుగుతున్నాడు. రెండవ వ్యక్తి ఓ రోజు చనిపోయాడు. భార్యా పిల్లలు రోడ్డున పడ్డారు. మొదటి వ్యక్తి డబ్బులు ఇవ్వట్లేదు. రెండవ వ్యక్తి భార్య మొదటి వ్యక్తి నుండి డబ్బు తీసుకోవాలి అంటే కోర్టుకు వెళ్ళాలి, అంటే, డబ్బులు ఇచ్చినట్లు ఆధారం కావాలి, నిరూపించుకోవాలి. దీన్ని చట్టం అంటారు. మొదటి వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు రెండవ వ్యక్తి ఎలాంటి ఆధారం తీసుకోకుండా ఒక నమ్మకంతో డబ్బు ఇచ్చాడు. మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి నమ్మకాన్ని రక్షించాలి. ఆ డబ్బును భార్యా పిల్లలకు తిరిగి ఇచ్చివేయాలి. ఇది న్యాయం. మొదటి వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు రెండవ వ్యక్తి తన చెయ్యి అందించాడు. కష్టంలో నుండి బయటపడేసాడు. రెండవ వ్యక్తి అకాల మరణంకు గురైనాడు. అయన భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. మొదటి వ్యక్తి వీరికి చేయూతనివ్వాలి. ఇది ధర్మం. కాబట్టిగొప్పనాయకుడు చేసింది తప్పే.
Also read: ప్రపంచ అద్భుత భర్తలు(World Wonderful Husbands) -5
1960 కి ముందు నుండే అన్ని చట్టాలు ఉన్నాయి. బాల్య వివాహాల రద్దు చట్టం, విడాకుల చట్టం ఇలా చాలా చట్టాలు ఉన్నాయి. ఇవిఅన్నీ మతఆచారాల – కట్టుబాట్ల నుండి పుట్టుకవచ్చిన చట్టాలే . స్త్రీల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతున్నదని మతాల ఆచారాలను కొంచెం కొంచెం సంస్కరించుకుంటూ చట్టాలను ఏర్పాటు చేసారు. రాజ్యాంగం ప్రకారం చేసినట్లైతే “చట్టం ముందు అందరూ సామానులు” అనేది అమలు జరుగుతుండే. అది లేదు కాబట్టే “ఈక్వాలిటీ బిఫోర్ లా ” అనేది సంక్షోభంలో చిక్కుకున్నది. అందుకే ఇంత గందరగోళంగా “మానవ సంబంధాలు” ఉన్నాయి. ఎవరి మత మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు, జీవిస్తున్నారు. క్రైమ్ రేట్ కూడా అదే స్థాయిలో పెరుగుతూనే ఉంది. మహిళలపై దాడులు, వివక్ష ఏం ఆగట్లేదు. అందరూ వారి వారి మత కుల ఆచారాలనే పాటిస్తున్నారు. అయినా మహిళలపై దాడులు పెరుగుతూనె ఉన్నాయి. మతం వీటిని అరికట్టలేక పోతున్నది అంటే “మతం విఫలమైనట్లే”. మరి ఎందుకు ఆచారాలను పాటిస్తున్నట్లు? తారతమ్యాలను అరికట్టేటందుకు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని దేశ పౌరులందరూ గౌరవించాలని, రాజ్యాంగ పరిధిలోనే నేరాలను అరికట్టాలని ఎందుకు “ఆర్డినెన్సు” చెయ్యట్లేదు? ఎందుకంటె నేటి ప్రభుత్వాల “బలం” ఎప్పుడూ ప్రజల అజ్ఞానంలో ఉంటుంది. ఈ విషయం ప్రభుత్వాలకు బాగా తెలుసు. కాబట్టి ప్రజల్లో నిజమైన జ్ఞానాన్ని ఈ ప్రభుత్వాలు నింపవు. ఈ సత్యాన్ని ప్రజలు గుర్తించాలి. ప్రజల్లో జ్ఞానానికి బదులు అజ్ఞానాన్ని పెంచుతున్న ప్రభుత్వాలు ప్రజలకు అత్యంత హాని చేస్తాయి.
Also read: (World’s Wonderful Husbands) ప్రపంచ అద్భుత భర్తలు-4
మనిషిలో ఉన్న భయమే అన్ని రకాల అసమానతలకు దారి వేసింది. ప్రజలలో ఉన్న భయంతో “జీవితాలు ప్రమాదకరమైన అంచుల దగ్గర” ఉన్నాయి. ఆచార వ్యవహారాలు మనిషిని భయపెట్టిస్తున్నాయి. భయంచేత మనిషి నాగరికత వైపు ప్రయాణించటంలేదు. వేషధారణలో మాత్రమే నవ్య నాగరికతను ప్రదర్శిస్తున్నాడు. వివక్షను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడు. బహుళ అంతస్థులలో జీవించటం, రోడ్లను వెడల్పు చేసుకోవటం అభివృద్హి, నాగరికతకు రూపం అంటే ఎలా? నాగరికతకు ఒక దారి అనవచ్చు. జీవన విధానంలో సమూలమైన మార్పు జరగాలి. ఒకరు పదివేల రూపాయలు ఖర్చు పెట్టి భోంచేస్తున్నారు, మరొకరు పది రూపాయలు ఖర్చు పెట్టి భోంచేస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని ఏ విధంగా అధిగమిస్తారో అప్పుడు నాగరికతను అనుభవిస్తున్నట్లు, ఆ నాగరికతను ఇక్కడ చూపించాలి.
Also read: (World’s Wonderful Husbands)ప్రపంచ అద్భుత భర్తలు-3
ప్రజలకోసం సేవ చేసేటందుకు ప్రజల మధ్యకు వస్తే, ఆ మనిషి ప్రజల మనిషి. వారికి వ్యక్తిగతం, వ్యక్తి స్వేచ్ఛలు లాంటివి ఉండవు. నాయకులకు కుటుంబాలు, వ్యక్తిగతం, స్వేచ్ఛలు ఉంటాయి. అయితే అవి పరిమితం. ఆ నాయకుడు ప్రజావ్యతిరేకమైన పని ఒకవేళ చేస్తే ” వ్యక్తిగతం, వ్యక్తి స్వేచ్ఛ ” అనిచెప్పి వదిలెయ్యలేము, వదిలెయ్యకూడదు. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. గొప్ప నాయకుడిని ఉదారత్వంతో “సమర్ధన” చేస్తే చేయండి.
కానీ, తాను చేసింది “రైట్” అని మాత్రం చెప్పకూడదు. దూరం నుండి భర్తను చూసి భార్యకు ఆనందం కలుగుతుండొచ్చు. ఇది ఏది మనకు కనిపించటం లేదు. చట్టం,న్యాయం, ధర్మం లో ఏదీ ఆ భార్య కు అందలేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోలేక పోయినా ఇదే వాస్తవం. గొప్పనాయకుడు .. దేశాన్ని గొప్ప దేశంగా, బలిష్టమైన దేశంగా, అద్భుతమైన దేశంగా, ఉదాత్తమైన దేశంగా తీర్చి దిద్దుతారా? లేరా? అనే విషయాల జోలికి నేను వెళ్లదల్చలేదు. ఇది మీకు, పాఠకులకు వదిలివేస్తున్నాను. చివరిగా ఒకమాట …. పాలకులు ” పాత బ్రాహ్మణుల [గతంలోఅంటే వేదాల కాలం నుండి కూడా పనిని బట్టి లేక ఒక కుట్రతో ఫలానా వారు బ్రాహ్మణులూ వీరి పెత్తనం మాత్రమే చెల్లుతుంది, ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా బలవంతులనియు, అంటరానితనాన్ని పెంచిపోషించారనియు అనేభావనలుసమాజంలో ఉంది.. ఇంకా సూటిగా చెప్పాలంటే హిందుత్వంలోని వారు పాతబ్రాహ్మణులు అని నా ఉద్దేశ్యం] స్థానంలో కొత్తవాళ్లకు [నేడుఅన్నికులాలలో, మతాలలోఅంటే ఒక్కహిందూ మతంలోని వారేకాదు అన్ని మతాలలోను .. ఏ అంటరానితనాన్ని అసహ్యించారో, ఏ దోపిడీని ద్వేషించారో దాన్నేఅనుసరిస్తున్నవారు, కౌగిలించుకుంటున్నవారు అని] స్థానంఇచ్చారు … అందుకే తప్పును తప్పుగా . . ఒప్పును ఒప్పుగా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. దీన్ని కూల్చుతే సమగ్రమైన అభివృద్ధికి నాంది ప్రస్తావన పడుతుంది. 1960 నుండి పరదా చాటునుండి చూస్తున్న ఈ ప్రపంచాన్ని, పరదా నుండి బయటకు వచ్చి స్వచ్ఛమైన స్వేచ్ఛా వాయువులను సొంతం చేసుకుంటారని నా అభిప్రాయం.
జై హింద్ …
Also read: (World Wonderful Husbands) ప్రపంచ అద్భుత భర్తలు-2         
సెల్వరాజ్ , నారాయణ్ దాస్ , రాధికా ఎస్తేర్, మాధవ్ ఆర్య , మురారి … ల అందరి స్టేట్మెంట్స్” చాలా విలువైనవే. ఫలాన వారి ప్రతిపాదన బాగుంది, ఫలానా వారి ప్రకటన బాగాలేదు అని చెప్పలేము. ప్రతి ఒక్కరి నివేదికను పరిశీలించాలి. పుట్టిన ప్రతీ మానవుడు చిన్న చిన్న సాధారణమైన సమస్యలను తప్పక ఎదుర్కొంటాడు. మీ అందరి అభిప్రాయాలు ఆ సమస్యలకు ఒక దారి చూపుతాయని నాకు చాలా గట్టిగా నమ్మకం ఉంది. చివరిగా ఒక విషయం … విచిత్రమైన విషయం ఏంటంటే … ఇతరుల మనోభావాలను గౌరవించాలి, కానీ, హృదయానికి గాయం అయితే మాత్రం ఉపేక్షించకూడదు …. పిల్లి మేడలో గంట ఎవరు కడతారని …
Also read: World Wonderful Husbands (ప్రపంచ అద్భుత భర్తలు) -1       
-అజీబ
రచయిత అభిప్రాయం: మహిళలు అన్నిరంగాలలోకి ప్రయాణిస్తున్నారు. వారి సత్తా ఏంటో చాటుతున్నారు. సమాజంలో అన్నిరంగాలలో అభివృద్ధిజరుగుతోంది.ఇందులోఎలాంటి అనుమానం లేదు.అయితే, స్త్రీలవిషయంలోనే సంస్కృతి / సాంస్కృతికపరమైన వాటిల్లో అభివృద్హి / మార్పులు జరగటంలేదు. అందుకే స్త్రీ / భార్య సమాజంలోనే “ప్రాధాన్యత ” లేని మనిషిగా పరిగణిస్తున్నారు. దీనిని మెజారిటీ మహిళలు ఎక్సెపెక్ట్ చేస్తున్నారు. బహుశా, ఎన్నో తరాలుగా మహిళలు అలానే ఉన్నారు కాబట్టి అలవాటు పడిపోయారు. సహజము అని ఎవరికి వారు భావిస్తున్నారు. అందుకే స్త్రీ – పురుషులమధ్య CONFLICTS ఉన్నాయి. సాధారణ మనిషి నుండి -ఐకాన్లుగా చూపబడుతున్న వారివరకుస్త్రీలపట్ల నమ్మశక్యం కాని ఒక అలసత్వం వారిలో కనిపిస్తోంది. దీనికి ఎలాంటి జవాబు వస్తుందో వెతికే ఒక ప్రయత్నంలో భాగంగా 1 నుండి 9 భాగాలుగా “World Wonderful Husbands -ప్రపంచ అద్భుత భర్తలు” అనేశీర్షికతో కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని కేస్స్టడీ / కేసులస్టడీగా రాయటంజరిగింది. ఇది ప్రత్యేకంగా ఎవ్వరినిీ టార్గెట్ చేసి రాయలేదు. టార్గెట్ కూడా చేయలేదు. ఎవరైనా దీనికి రాజకీయరంగు పూస్తే నేను బాధ్యురాలినికాను. (నాకలం పేరు అజీబ)
(సమాప్తం)
జయ వింధ్యాల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ రాష్ట్రం (PUCL-TS)

9440430263

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles