మా అమ్మమ్మకు వంటిల్లు తప్ప మరేం తెలీదు. మా అమ్మ పెద్దగా చదూకోలేదు. కాని చాలా విష యాలు చక్కగా మాట్లాడగలదు. నా డిగ్రీ చదివిన భార్యను ఉద్యోగం చేస్తావా అంటే మీరు చెయ్యమంటే చేస్తా అంది. నీ ఇష్టం అంటే వద్దనుకుంది. నా కూతుళ్లు ఇద్దరూ MBAలు చదివి ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
మరి మగవాళ్ళ విషయానికివస్తే అదివరకు బయటి పనులన్నీ మగాళ్ళే చేసేవాళ్ళు. కాని ఇటీవల ఆడ మగ కూడా ఉద్యోగాలు చేస్తున్న కాలంలో కొంతమంది మొగుళ్లుగానే ఉంటున్నారు. ఎంతైనా పితృ స్వామ్య వ్యవస్థ కదా.
కొంత స్వతంత్రం దక్కిన ఆడవాళ్లు బయటికి వస్తే మగవాళ్లు ఆడవాళ్ళ మధ్య సమభావం, సమన్వయం కుదరడానికి రెండు మూడు తరాల సమయం పడుతుంది ఇద్దరికి. ఈ సంధి కాలం గడిస్తే అరమరికలు లేకుండా, అనైతికత లేకుండా ఆడ మగ తేడా లేకుండా కలవడం వీలవుతుంది. విదేశాల భ్రష్టుత్వం మాత్రమే అనుకరిస్తున్న స్థితి పోయి వారి మంచిని గ్రహించే రోజు వస్తుందని అనుకుంటున్నాను.
అదే చలం కోరిన స్త్రీ స్థితి.
Also read: “రచన లక్ష్యం”
Also read: “మహమ్మారి”
Also read: “గుడిపాటి వెంకట చలం – అధివాస్తవికత”
Also read: చర్యా పదాలు – ఒక పరిశీలన
Also read: ఆధునిక తెలుగు కవిత్వ పోకడలు