————————-
( ‘ THE MOUSE AND THE CAT’ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం:డా. సి. బి. చంద్ర మోహన్
32. సంచారి తత్త్వాలు
————————
ఒకానొక రోజు సాయంత్రం పూట ఓ కవి, ఒక రైతుని కలిసాడు. ఆ కవి ముభావి. ఆ రైతు సిగ్గరి. అయినా వారిద్దరూ సంభాషించుకున్నారు.
రైతు ఇట్లా అన్నాడు.” ఈ మధ్య నేను విన్న చిన్న కథ చెబుతాను. ఒక ఎలుక, బోనులో చిక్కుకుంది. అది బోనులో ఉన్న పన్నీరు ముక్క ఆనందంగా తింటూ ఉండగా , ఒక పిల్లి వచ్చి పక్కన నిలబడింది. ఎలుక దానిని చూసి కొంత సేపు వణికింది. కానీ బోనులో తాను సురక్షితమని దానికి తెలుసు.
అపుడు పిల్లి ” నువ్వు నీ చివరి భోజనం తింటున్నావు. మిత్రమా! ” అంది.
” అవును” అని ఎలుక చెప్పింది.
ఎలుక ఇంకా ఇలా అంది ” నాకు ఒకే జన్మ. అందుచేత ఒకే చావు కూడా! కానీ నీకో? నీకు తొమ్మిది జన్మలున్నాయంటారు. అంటే దాని అర్థం — నీవు తొమ్మిది సార్లు చావాలి కదా!”
ఆ రైతు కవి వైపు చూసి ” ఈ కథ వింతగా లేదూ?” అన్నాడు.
కవి అతనికేమి జవాబివ్వలేదు. కానీ తన మనసులో ఇలా అనుకుంటూ నడిచి వెళ్లి పోయాడు.” ఖచ్చితంగా మనకు తొమ్మిది జన్మలున్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. తొమ్మిది సార్లు మనం మరణిస్తాం. తప్పక తొమ్మిది సార్లు మరణిస్తాం. బహుశా , చివరి భోజనం ఒక పన్నీరు ముక్కతో ఉన్న ఒక రైతు జీవితం లాగా – బోనులో ఉన్నా గానీ ఒక జన్మ ఉండడమే మేలు. అయినాగానీ , ఎడారి మరియు అడవి సింహాలకు మనం బంధువులం కాదూ?”
Also read: రూత్ దొరసాని
Also read: శ్రమ
Also read: రెండు కవితలు
Also read: పాత ద్రాక్ష సారా
Also read: ‘మరణానంతర జీవితం’ నవల – ఒక పరిశీలన