ఘనంగా కవి గోపి 73 జన్మదినోత్సవం
ఆ గొడవ వేరు
డబ్బులే కావాలంటే
రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేసేవాణ్ని.
కవిత్వం ఎందుకు రాస్తాను!
పుస్తకాలు
అమ్ముడు పోలేదని అంగలార్చను
లక్షలు గుమ్మరించి
అచ్చువేసుకుంటాను.
ఎవరూ కొనడం లేదని దుఃఖ మేల!
కొందరైనా దుకాణాదారులకు
భృతిని కల్పించడంలో సంతోష పడతాను.
పాఠకులు లేకుంటే ఒప్పుకోన్నేను
అందుకే
కనపడ్డ ప్రతి రసజ్ఞునికీ పంచి పెడతాను
నలుగురు నా వాక్యాలు
ఉటంకిస్తే ఉబ్బిపోతాను.
నవ్వకండి
చాలా గ్రంథాలు
అప్పు చేసే ముద్రణ చేయించాను
మెల్లగా తీర్చాననుకోండి,
లోకం నాకే అప్పు పడేంతగా
జీవన వాక్యాలు వెదజల్లాను.
ఉన్నారు
ఆభిరుచి సమ్రాట్టులు,
ఉన్నారు బ్రతుకు మూలాలను అన్వేషించే
అభినవ నవ నవోన్మేష భావుకోత్తములు,
అంతరంగాన
ఆంతరిక ప్రకాశంతో
ఉన్నత మూల్యాల వైపు సాయం పట్టే సోపాన సదృశులు
వారి కోసమే గదా కవిత్వం!
పెద్ద పెద్ద పదవులు నిర్వహించాను
కాని కవి అన్న గుర్తింపే నాకు పులకరింపు.
మా యింటి నిండా పుస్తకాలు
ర్యాకుల నిండా
కుర్చీల నిండా,
మార్గ దర్శనం చేసే మహానుభావుల్లా
రెపరెపలాడుతుంటాయి.
ఎప్పటికీ మారని ప్రాణ స్నేహితుల్లా పలకరిస్తాయి.
పుస్తకాలు తోడుగా వున్న నాకు
నిరాశ ఇసుమంతైనా వుండదు
వినూతన ధీధితులు నిండిన
నా జీవితం
క్షణక్షణం అక్షరభరితం.
ఆర్తిమేఘాలు కదలాడే
నా కళ్లల్లోకి ఓసారి చూడండి
కురవటానికి సిద్ధంగా ఉంటాయి.
దోసిలిపట్టి కూర్చున్నాను
మీరూ కాస్సేపు రండి!
Also read: శీలా వీర్రాజు స్మృతిలో..
Also read: Cataract సర్జరీకి ముందు
Also read: అతీత
Also read: లత జ్ఞాపకాలు
Also read: రాచకొండ