రాముడు విష్ణు అవతారం, లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం. అలాగే కృష్ణుడు విష్ణు అవతారం, బలరాముడు ఆదిశేషుడి అవతారం. విష్ణు బలరాముడిగా, కృష్ణుడిగా ఒకేసారి ఎందుకుంటాడు? బుద్ధుడు వేరే మతం అంటూ బయటికి తోయడానికి బలరాముడి స్థాయి మార్చి రంగంలోకి దింపారు కొందరు పెద్ద మనుషులు.
“మత్స్య, కూర్మ, వరాహాత్స్య, నారసింహ, వామనహ్,
రామో, రామత్స్య, రామత్స్య, బుద్ధ, కల్కి రేవచహ్” అన్నది శ్లోకం
ఇందులో ముగ్గురు రాముళ్ళు వరుసగా శ్రీరాముడు, పరశు రాముడు, బలరాముడు.
(ఇంటి పెద్ద పేరున పెళ్ళి పత్రిక ఇవ్వడం మనం ఈనాటికీ పాటిస్తున్న సాంప్రదాయం. అందుకే) కృష్ణుడి పేరు బదులు బలరాముడి పేరు ఉన్నది శ్లోకంలో. దీన్ని అవకాశంగా తీసుకుని హిందూ మతంలో మరో బుద్ధుడి కథను సృష్టించారు కొందరు. అన్ని అవతారాల్లో రాక్షసులను చంపి మంచిని రక్షిస్తాడు విష్ణు. బుద్ధుడి అవతారంలో అశోకుడి లాంటి అనేక మందిలో రాక్షస లక్షణమైన క్రూరత్వాన్ని, హింసను చంపి వారిని సాధు స్వభావులుగా మార్చడం జరిగింది. చెడ్డవాడిని కాదు చెడును చంపమనే ఒక ఉన్నత పరిణామాన్ని (evolution) ప్రపంచానికి ప్రసాదించింది బుద్ధుడి అవతారం.
Also read: “ప్రేమ తగ్గితే”
Also read: “రక్షణ”
Also read: “నటనాలయం”
Also read: “నాన్న ప్రయాణం”
Also read: “కావాలి”