బైబిల్ అంటే…-2
నరిశెట్టి ఇన్నయ్య
బైబిల్ అంటే క్రిస్టియన్ల పవిత్ర మత గ్రంథం అని అనుకునేవాడిని. కాదని ఇటీవలే తెలిసింది. బైబిల్ అంటే కేవలం పుస్తకం అట. ప్రాచీన కాలంలో లిపిలేని వాడుక భాషలో ప్రచారానికి వచ్చిన ప్రత్యేక విషయమే బైబిల్. మన కొండ జాతులకూ, ఆదిమ జాతులకూ లిపిలేని వాడుక భాష ఉన్నట్టే గ్రీస్ వంటి దేశాలలో అనేక సంగతులు కథలు వ్యాపించాయి. హీబ్రూ, గ్రీస్ భాషలలో ఉన్న కథలనే బైబిల్ గా వ్యాపించాయి.
ఇటీవల క్రైస్తవ ప్రొఫెసర్, వర్జీనియా యూనివర్శిటీలో బోధన చేస్తున్నక్రిస్టికో సైన్సన్ ఇటీవల ఒక విడ్డూరమైన పుస్తకం పేరుతో పరిశోధనా రచన చేశాడు. దాన్ని ఆక్స్ ఫర్డ్ ప్రచురణకర్తలు వెలువరించారు. అందువలన ప్రామాణికం ఏర్పడింది. ఆమె స్పష్టంగా పేర్కొంటూ తాను చర్చికి వెడతాననీ, క్రైస్తవ మతాన్ని పాటిస్తాననీ చెప్పింది. కనుక ఆమెను శంకించనక్కర్లేదు. బైబిల్ గురించీ, క్రైస్తవ మతం గురించీ ఆమె పరిశోధనలు లోతుపాతులు కలిగి ఉన్నాయి. ఆ విషయాలు చెప్పడానికే ఈ రచనలో ప్రయత్నం సాగింది.
గ్రీక్ నుంచి వచ్చిన పదం బైబిల్. వాస్తవానికి పుస్తకాలు అని గ్రీక్ లో స్పష్టం చేశారు. బైబిల్ రచన అన్నీ కలగాపులగంగా, కథలూ, కవితలూ, జాబితాలూ, పరస్పర విరుద్ధమైన విషయాలు కనిపిస్తాయి. హిబ్రూ, గ్రీక్ భాషలలో వచ్చిన బైబిల్ విచిత్రంగా వ్యాపించింది. ఇందులో యూదులు స్వీకరించింది హిబ్రూ భాషలో రచన. అందులో క్రీస్తు కనిపించడు. యూదులు క్రీస్తును దైవంగా స్వీకరించలేదు.
క్రీస్తు పుట్టుక, తదనంతర కథనం స్వీకరించిన చరిత్ర క్రైస్తవులది. వారు పాత, కొత్త నిబంధనలు స్వీకరించారు. బైబిల్ ఒక వైపు క్రైస్తవులకూ, మరోతీరులో యూదులకూ ప్రవిత్ర ప్రమాణ గ్రంథం అయింది.
Also read: బైబిల్ అంటే పుస్తకమేనా?
(సశేషం)