శివమెక్కిన రాత
పదాల ఢమరుక మోత
లయబద్ధ శబ్ద తాండవం
మాటలే తూటాలుగా
జల జల జారే చెమట చుక్కలే
నెత్తుటి ధారలుగా
కుత కుత ఉడికే ఉద్వేగంతో
రాలే కన్నీళ్లే నిప్పు కణికలుగా
ఎగసి పడే ఉఛ్వాస నిశ్వాసాలే
వాడి శరాలుగా వాడి
విప్లవ శంఖ నాదం పూరించి
తెలుగు కవితను కొత్త పుంతలు తొక్కించి
పురస్కరించి
నన్నయలా రాసినా
సినీ కాల్పనిక నయగారాలు చూపినా
యువ కవులకు స్ఫూర్తిగా నిలిచినా
శ్రీరంగం శ్రీనివాసరావుకే చెల్లు.
(15 జూన్ శ్రీశ్రీ వర్థంతి)
Also read: “జీవిత సాఫల్య పురస్కారం”
Also read: “పూజా ఫలం”
Also read: “సంక్రాంతి”
Also read: “రాజ్యాంగం”
Also read: “ఏది నిజం”