నిఖిత్ జరీన్, ఈషా సింగ్
- ముఖ్యమంత్రి నిర్ణయం, జీవో విడుదల
- మొగులయ్యకు కోటి, బిఎన్ రెడ్డి కాలనీలో ఇంటి స్థలం
అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈమేరకు., ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ కూ, జర్మనీలో జరిగిన ఐఎస్ ఎస్ ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఈషా సింగ్ లకు ఒక్కొక్కరికి రూ 2 కోట్ల నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన విధంగా, పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగిలయ్య కు రూ 1కోటి నగదు పురస్కారాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పద్మశ్రీ మొగిలయ్య కోరుకున్నట్టుగా బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో నివాస యోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది