నీ చుట్టూ చేరి నిన్ను ఊరిస్తారు
నీ ఆశలకు ఎరువులు వేసి పెంచుతా మంటారు
నిన్ను చూసుకునే బాధ్యత నాదేనంటారు
నువ్వే నాకు దిక్కు అంటారు
దణ్ణం పెడతారు, నీ కాళ్లకు మొక్కుతా నంటారు
నీ బిడ్డ చీమిడి తీసి చొక్కాకు పూసుకుంటారు
నరుడా ఏమి నీ కోరిక, చెప్పు, తీర్చేస్తా నంటారు
ఓట్ల పండగకు నువ్వే దేవుడివంటారు
ఉబ్బిపోయి బోల్తా పడకు
ఓటంటే నీ బతుకు బాగు చేసే సాధనం
నీ నాగలి, నీ సుత్తి జాగ్రత్తగా వాడుతావుగా
అలాగే నీ వోటుకూడా జాగ్రత్తగా ఆలోచించి వాడు
నీతోపాటు అందరికి మంచి చేసేవాడికే వెయ్
నీకు, నీ సాటివారికి కలగాలి జయం
మనోడికి కాదు మంచోడికి ఓటు వెయ్
అదే మనందరికీ శుభం.
Also read: “అద్వైతం”
Also read: ‘‘ప్రపంచం”
Also read: “తపన”
Also read: “యుగాది”
Also read: “మునక”