- పీవీ మార్గ్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
- ఎనిమిది మాసాలుగా విగ్రహం పనులు నడుస్తున్నాయి
హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ లో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ లోగా ప్రతిష్ఠిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పీవీ మార్గ్ లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం పనులను కేటీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, గత 8 నెలలుగా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో పనులను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు దేశానికే తలమానికంగా నిలవనున్నది. పర్యాటక రంగాన్ని ఆకర్షించేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పర్యాటక రంగం పుంజుకుంటుందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ సాధ్యమైందని మంత్రి స్పష్టం చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలు:
‘‘ప్రజాస్వామ్య పరి రక్షణ కోసం పాటు పడే వారికి అంబెడ్కర్ ఆదర్శం. ప్రపంచంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్ లో నిర్మాణం అవుతుంది. ఎనిమిది నెలల గా అంబేద్కర్ విగ్రహ పనులు ముమ్మరము గా సాగుతున్నాయి. 55 అడుగులు బేస్, 125 అడుగులు విగ్రహం రెడి అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ కి విగ్రహం పనులు పూర్తి అవుతుంది. భారత దేశ ప్రజలు కి ఈ ప్రాంతం స్ఫూర్తి కాబోతోంది. తెలంగాణ ప్రయోజనాలకి ఎక్కడ భంగం కలిగినా అంబేద్కర్ బాటలో నడుస్తున్నాం. మిగతా రాష్ట్రాలు కి స్ఫూర్తి వంతం గా తెలంగాణ నడుస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలు కి ఎవరు విఘాతం , కేంద్రం అడ్డంకులు కల్పించిన పోరాడాతాం. అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ సాధించాము. మ్యూజియం, ధ్యాన మందిరం నిర్మించాలని సూచనలు వస్తున్నాయి. రామేశ్వరంలో ఉన్న అబ్దుల్ కలాం, ప్రపంచంలో ఉన్న ఇతర ప్రాంతాలు ను సందర్శించి విగ్రహ నిర్మాణము చేపడతాము. ముఖ్యమంత్రి సంకల్పంఈ విగ్రహం. దేశ ప్రజలు కు ఇదొక కానుక. ఆంబేడ్కర్ ఆశయాలు పూర్తి స్థాయి లో అమలు కావాలి. ఆర్ధిక అసమానతలు కి తావు లేకుండా దేశ ప్రజలు అందరు బాగుపడాలి’’ అని కేటీఆర్ అన్నారు.