దాశరధి
అయోధ్య రాముడు
మర్యాదా పురుషోత్తముడు
జీవన విలువలకు
నిలువెత్తు రూపం
పుత్రుడిగా శిష్యుడిగా
సోదరుడిగా భర్తగా
మిత్రుడిగా స్వామిగా
రాజుగా ధార్మికుడిగా
ఏ రూపంలో చూసినా
అపురూపంగా ఆదర్శంగా
నిలచినవాడు శ్రీరాముడు.
ఉన్నాడని నమ్మిన గాంధి
మహాత్ము డయ్యాడు.
నాటి రామసేతు నిజమని
నిర్ధారించింది నేటి నాసా
ఆనాటినుండి ఈనాటిదాకా
రాముడిని శంకించే వారున్నారు,
అంతకంటే ఆదర్శ జీవి
యుగయుగాల చరిత్రలో
మరొకరు లేక పోయినా.
ధర్మమే ఊపిరిగా బ్రతికిన వాడిని
రాజ్యాన్ని అర్థాంగిని వదలిన నిర్మోహిని
మనం అఙానంతో వదులుకుంటే
మన దారి గోదారే.
రాముడు నడచిన దారే
సమస్త మానవ జాతికి
ఇహ పరాలకు రాచబాట.
Also read: “మహా భాగ్యం”
Also read: “స్వతంత్రం”
Also read: “చెప్పుల జోడు”
Also read: “లేమి’’
Also read: “కాలాక్షేపం”