కుడి కాలి చెప్పు
ఎడమ కాలి చెప్పును
పరిచయం చేసుకుంటూ అంది
‘నేను బాటా‘ అని
‘నేనూ బాటానే‘ అంది
సంతోషంగా ఎడమ చెప్పు.
రెండూ చాలా స్నేహంగా
ఒకరినొకరు వదలకుండా
కలిసి తిరిగే వాళ్లు.
అవి తొడుక్కునే కాళ్ళే వాటి ప్రపంచం.
వాటి మద్య పోటీ లేదు
ఎవరి కాలు వారిదే.
రెండు చెప్పులకు దేవుడంటే పడదు
వాటి కాళ్లు గుడి కెళ్లినా
ఇవి బయటే ఉండి పోయేవి.
ఓ గుడి దగ్గర ఎవడో
తమని తన కాళ్లకు వేసేసుకుని
ఒక రాజకీయ సభకు వచ్చాడు.
వేదికపై నాయకుడి ఉపన్యాసం విని
ఎడమ కాలి చెప్పు తీసి
నాయకుడి పైకి విసిరాడు
వాడి ముక్కు పగిలింది
అంతా గందర గోళం
అందరూ వెళ్ళిపోయారు
చెప్పు విసిరినవాడు కూడా వెళ్లాడు
కుడి చెప్పును ఆక్కడే వదిలేసి.
ఇంత వరకు జంటగా నడిచిన చెప్పులు వేరయ్యాయి.
వేదికమీది చెప్పుకు గర్వంగా ఉంది
తన జన్మ సార్థకమైందని.
(శ్రీ శరద్ జోషి హింది కవిత ఆధారంగా.)
Also read: “లేమి’’
Also read: “కాలాక్షేపం”
Also read: ‘‘వసంతం’’
Also read: పరిణామం
Also read: మహిళా దినం
బాగుంది