Thursday, November 21, 2024

థింక్ బిగ్ అండ్ ఎఛీవ్ బిగ్ …

గాసు సిలిండర్ ధరలు పెరిగాయని…

పెట్రోల్ రేట్ పెరిగిందని ఏడిస్తే మాత్రం నేను ఒప్పుకోనబ్బాయ్ …

అసలా మాటింటేనే నాకు కోపం నషాళానికంటుతుంది.

ఇప్పుడూ … రేట్లు తగ్గాలనడం దౌర్భాగ్యం …

రేట్లు మండిపోతున్నాయ్ అని గగ్గోలు పెట్టడం దేశభక్తి లేకపోవడం …

దేశ ప్రగతిని కుంటుపడేయడం…

ఇవన్నీ కాదయ్యా దేశద్రోహం అంతే ఆ …

లీటర్ పెట్రోల్ కొట్టించుకుని ఓ ఫైవ్ హండ్రడ్ రూపీస్ నోట్ అలా విసిరావనుకో … ఎంత రిచ్ గా ఉంటుందో ఊహించు …

కిలో వంకాయలు అరకిలో బీరకాయలు రెండు కిలోల టమాటాలు కొనేసి ఓ రెండు వేల రూపాయల కాయితం అలా గిరాటు వేసావనుకో .. ఎంత రిచ్ నెస్సు ..

రాజమౌళి మూడార్ల రోజుల్లో చిత్తూరు నాగయ్య నాటి బుర్రలతో….

అబ్బబ్బ ఎంత విసుగ్గా ఉంటుందో … వీళ్లని చూస్తుంటే …

అన్నీ రూపాయి పావలాలోనే రావలనుకోడం కన్నా దరిద్రం దౌర్భాగ్యం ఉంటుందా?

ఇట్టా రూపాయి పావలా గాళ్ల వల్లే దేశ ప్రగతి కుంటుపడిపోతుంది….

పరువు మంగళగిరి సంతకెడుతుంది …

అసలు  ఈ రేట్లు పెరగడం వల్ల జనాల్లో ఓ మోటివేషన్ వచ్చి నెల ఖర్చు లక్ష రూపాయలు వస్తోంది కాబట్టి ఓ రెండు లక్షలు సంపాదించాలనుకుంటారు.

అవునా కాదా?

అదే రేట్లు రూపాయి పావలా దగ్గరే ఉంటే … సంపాదించాలనే యావ చచ్చిపోయి … అరుగుల మీద కూర్చుని సోది దొబ్బుతూ ఉంటారు … రెడిక్యులస్ కదా …

ఏ మాత్రం సెన్సున్నవాడన్నా తన దేశ ప్రజలు ఇలా సోదిగాళ్లైపోవడం చూసి తట్టుకోగలడా?

అందుకే ఈ వాట్సప్పుల్లో డెబ్బైలో సరుకుల పట్టీ…

అరవయ్యిల్లో సరుకుల పట్టి అని పెట్టేవాళ్లను చూస్తే ఒళ్లు మండిపోతుంది …

వీళ్ళని రాజబాబు అన్నట్టు సెంటర్ చూసి పొడిచిపారేయాలనిపిస్తుంది ఒక్కొక్కణ్ణీ …

కందిపప్పు మూడు కిలోలు  ఐదు రూపాయలు … మొత్తం సరుకులన్నీ కలిపి డెబ్బై రూపాయలు లాంటి యూజ్ లెస్ దేశ ప్రగతిని దారుణంగా కుంటుపడేసే లాంటి పాత కాయితాలు ఫొటోలు తీసి పెడుతున్నారు.

ఇలా పెడితే ఉరిశిక్షే అని చట్టం తేవాలి అసలు…

ముందు వీళ్లందరినీ పోలీస్టేషన్లలో వేసి థర్డ్ డిగ్రీ పెట్టి కుళ్లబొడిచేయాలి …

అంటే ఏమిటీ?

దేశాన్ని డెబ్బైల్లోనే ఉంచేయాలనే దిక్కుమాలిన ఆలోచన కాదుటండీ అది …

ఇలాంటి వాళ్లని క్షమించతగునా?

నేనైతే క్షమించను …

నా చిన్నప్పుడు కిలో నెయ్యి పదహారు రూపాయలు ఉండేది … నేనే సీతారామ్ పురం దాకా నడుచుకుంటూ పోయి అక్కడ గానుగలో పదహారు రూపాయలు ఇచ్చి నెయ్యి తెచ్చేవాణ్ణి …

ఇప్పుడూ అదే రేటు ఉండాలనుకోడం ఎదుగుదల ఎట్టా అవుతుందీ అంట

… ఐదొందలో వెయ్యో పెట్టి అమూల్ నెయ్యి కొనుక్కోని వేసుకుంటే ఎంత రాయల్ గా ఉంటుందో ఆలోచించండి …

అసలు ధరలు మండిపోతున్నాయనిగానీ .. తగ్గాలనిగానీ అన్నవాణ్ణి షూట్ చేసి పారేయాలి …

బొత్తిగా దేశభక్తి కాన్షస్నెస్సు లేని చీప్ యిడియట్స్ … మా ఊరి భాషలో మాట్లాడాల్సొస్తే అలగా జనం … వీళ్లే దేశానికి దరిద్రం …

థింక్ బిగ్ అండ్ ఎఛీవ్ బిగ్ … ఇంకోసారి ఎవరైనా పెట్రోల్ రెండు వందలైంది

 నా బొందయ్యిందని రాశారో …. వాళ్ల రెండు రెప్పల మధ్యా అగ్గిపుల్లలు పెట్టి రెండు రెక్కలూ కుర్చీకి విరిచి కట్టి అరడజను బాలయ్యబాబు సినిమాలు నాన్ స్టాప్ గా చూపించేస్తా … జాగ్రత్త … హన్నా …

ఒకేళ ప్రభుత్వం కనుక వీళ్ల గొడవ చూసి రేట్లు తగ్గిస్తే మాత్రం నిరసనగా ఆమరణ ఆహార దీక్ష చేస్తానని వార్నింగ్ ఇస్తున్నా …

Also read: బాపు రమణలు ఎంతటి దుర్మార్గులో తెలిస్తే అవాక్కవుతారు!

Also read: మిసెస్ తేడాసింగ్ లెక్చర్ ఆన్ యాప్ వరల్డ్

Also read: మాయాబజార్ నలుగురు అమ్మల కథ

భరద్వాజ రంగావఝల
భరద్వాజ రంగావఝల
పేరు భరద్వాజ రంగావఝల. వృత్తి జర్నలిజం. బాపు రమణ అంటే వల్లమాలిన అభిమానం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles