Sunday, November 24, 2024

దేవుడు

రాజేందర్ జింబో

చాలా రోజుల నుంచి

నాకో సందేహం 

మొదలైంది

దేవుడున్నాడా అని

అర్హులు కిందికి

అనర్హులు పైకీ 

వెళ్తుంటే

మిఠాయి

మీద ఆశతో 

తెలిసి తప్పులు చేస్తుంటే 

పప్పు బెల్లాలు

ఆశ  పెట్టి  తప్పులు చేయిస్తుంటే

సందేహం సహజమే!

నిర్ణయం ఒకరిది

చెప్పేవాడు

మరొకడు

అంతా అయోమయం

అగమ్యగోచరం

ఫర్లోగ్ లో వున్న రేపిస్ట్ బాబా కి

జడ్ క్యాటగిరి

ఓటు వెయ్యడానికి

డబ్బుల డిమాండ్

ఇలా ఎన్నో

దృష్టాంతాలు

అందుకే

దేవుడున్నాడా..?

దేవుడున్నాడా..?

నిరంతరం వేధిస్తున్న ప్రశ్న

వంద కాదు వేయి తప్పులు 

దాటిన తరువాత

కూడా దుష్ట శిక్షణ

జరగకపోతే 

దేవుడున్నాడా నన్నది

జవాబు దొరకని

సందేహం 

బయట ఎవడో 

అరుస్తున్నాడు 

న్యాయం గెలిచిందని

అవును

న్యాయం గెలిచింది 

దేవుడు వాళ్ళ వైపు

వున్నాడేమో

Also read: హిజాబ్

Also read: కొన్ని రాతలు

Also read: కనబడుట లేదు

Also read: నొప్పి మందు

Also read: ఒకప్పుడు …

Rajender Mangari
Rajender Mangari
మంగారి రాజేందర్ జింబో కి కవిత్వం,కథలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు . అందరికీ న్యాయం అందాలన్నది అయన అభిమతం . జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి,పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా తన సామాజిక బాధ్యత నిరంతరం అని విశ్వసించే వ్యక్తి. (మా వేములవాడ కథలు, జింబో కథలతో కథా సాహిత్యం మీద ఆయన చెరగని ముద్ర వేసారు. హాజిర్ హై అంటూ నేర న్యాయ వ్యవస్థ పై మరే కవీ రాయలేని కవిత్వం రాశారు. లోపలివర్షం,రెండక్షరాలు కవిత్వం సెంటిమెంట్, మానవ సంబంధాలు ప్రతిబింబిస్తే ,"చూస్తుండగానే "లో ఆధునిక జీవితం లోని సంక్లిష్టతని కవిత్వీకరించారు.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles