- 12కోట్లకు డీల్
- మంత్రితో పాటుగా ఆయన సోదరుడు శ్రీకాంత్ హత్యకు కుట్ర
- భగ్నం చేసిన పోలీసులు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగింది. దీనిని పోలీసులు ఛేదించారు. మంత్రితో పాటుగా ఆయన సోదరుడు శ్రీకాంత్ హత్యకు కుట్ర పన్నినట్లుగా విచారణలో తేల్చారు పోలీస్ లు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు. మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తులు ఫరూక్ అనే వ్యక్తికి సుపారి ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే, ఫరూక్ పేట్ బషీర్ బాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆయన ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ కు చెందిన నాగారాజు, యాదయ్య, విశ్వనాధ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.మంత్రి హత్య కోసం రూ 12 కోట్ల సుపారీ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఫరూక్ అనే వ్యక్తికి ఈ సుపారీ మొత్తాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అయితే అప్రూవర్‌గా మారిన ఫరూక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంచలనం బయటకు వచ్చింది. హత్య కుట్రపై పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ ప్లాన్‌లో భాగస్వాములైన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌ను నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు.. నాగరాజుపై గతంలోనూ పలు హత్య కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు ఇచ్చిన సమాచారంతో హత్య కుట్రలో భాగస్వామి అయిన మున్నూరు రవిని ఢిల్లీలోని బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి క్వార్టర్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు. బిజెపి నేత జితేందర్ రెడ్డి దిల్లీ నివాసంలో రఘుని అరెస్టు చేయ్యగా, రఘుకు ఆశ్రయం ఇచ్చిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురిని విచారించి వదిలేసిన పోలీసులు. హత్య కుట్ర కోణాన్నిసైబరాబాద్ పోలీసులు దిల్లీ పోలీసులకు తెలిపారు.