అందరూ అంటున్నారు
మనం విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవాలని
అది తెల్లవాళ్ళు తెచ్చిన ప్రగతి ఖని అని
అది లేకపోతే బ్రతుకు దుర్భరమని.
నిజమే. నేడు మొబైల్ ఫోన్, కంప్యూటర్, విద్యుత్తు
లేకపోతే బ్రతుకే లేదన్నట్లుగా మిగిలాం.
కాని ఇవి రాకముందు కూడా మనషులు బ్రతికారని
ఆనందంగా అందంగా బ్రతికారని మరచి పోతున్నాం.
తెల్లవాడికి సలాం కొడుతూ బండి లాగిస్తున్నాం.
అరిస్టాటిల్, డార్విన్, న్యూటన్, ఖోరానా, నర్లికర్లేకాదు అంతకంటే ముందు చరకుడు, వరాహమిహిరుడు, కణాదుడు,
భాస్కరుడు, శంకరాచార్యులు ఉన్నారని గుర్తులేక బ్రతికేస్తున్నాం.
నాసావారు చెబితేనే తెలిసింది, సూర్యుడికి భూమికి ఉన్నదూరం
హనుమాన్ చాలిసా పుట్టినప్పుడే మనకు తెలుసని
భూమి గుండ్రంగా ఉందని వరాహావతారం నాడే తెలుసని
పంచభూతాలని మనం పంచప్రాణాలుగా భావించామని
గాయత్రి మంత్రమే సద్భావనా పూరకమని
పతంజలి యోగమూ మోక్ష మార్గమని
తెల్లవాళ్ళు చెబితే తప్ప మనం నమ్మం
వాళ్ళు విజ్ఞానం గొప్పదంటే వంత పాడతాం
విజ్ఞానం కంటే జ్ఞానం గొప్పదని నోరుతెరచి చెప్పలేం.
శాస్త్రవేత్తల భౌతికత్వం కనిపిస్తుంది కాని
ఋషుల అనుభూతి తత్వం నేడు నిజమవుతుంటే తెల్లబోతాం.
అదే మన ఖర్మం.
(Feb 28, Science Day)
Also read: స్వేచ్చాజీవి
Also read: నేనెవరు?
Also read: స్వచ్ఛభారత్
Also read: అమ్మ – నాన్న
Also read: తెలుగు