గ్రామ రెవెన్యూ సహాయకులు VRA ల సమస్యలు పరిష్కారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి బహరంగ లేఖ వ్రాసారు. మీ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందని విఆర్ఎల చేత గొడ్డు చాకిరీ చేయించుకుని… వాళ్ల హక్కులను కాలరాస్తున్నారు.చాలీ చాలని జీతాలు … ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్ఒల పరిస్థితి దుర్బరంగా మారిందన్నారు. వీఆర్ఒల కు పే స్కేల్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అమలు చేయ్యలేదన్నారు. హామీలు ఇవ్వడం తప్ప… అమలు చేయాలన్న సోయి మీకు లేదని లేఖలో ఘూటగా వ్యాఖ్యనించారు. శేషాద్రి కమిటీ ఓ కంటి తుడుపు చర్యని అన్నారు. వీఆర్ఒలకు తక్షణం పే స్కేల్ అర్హులైన వీఆర్ఒలకు పదోన్నతులు,వాళ్లకు సొంత గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు, విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్ఒల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలిని లేఖలో పేర్కోన్నారు రేవంత్ రెడ్డి.