ఎరిన్ హాన్సన్ గ్యాలరీ
NOT
——–
( BY ERIN HANSON )
తెలుగు: డా. సి. బి. చంద్ర మోహన్
———
“నువ్వంటే” —
నీ వయసు — కాదు
నీ దుస్తుల కొలత — కాదు
నీ బరువు — కాదు
నీ కేశాల వర్ణమూ కాదు.
నీ పేరు కాదు
నీ సొట్ట బుగ్గలూ — కాదు
“నీవంటే” —
నీవు చదివిన గ్రంధాల సారం
‘నీ ‘ భాషణ
ఉదయం మూలిగే —
‘నీ ‘ గొంతు
‘నీ ‘ గుప్త హాసం
‘నీ ‘ హాసంలోని మాధుర్యం
‘నీవు ‘ దుఃఖిస్తూ రాల్చిన బాష్ప కణాలు!
ఒంటరిగా ఉన్నప్పుడు
ఎలుగెత్తి పాడే గేయాలే ‘ నువ్వు‘!
“నువ్వు ” —
నీవు సందర్శించిన స్థలాలే
నీ గృహమే
నీ నమ్మకాలే !
“నీవంటే ” —
‘నీవు ‘ ప్రేమించిన మనుషులే
‘నీ ‘ పడక గదిలో ఫోటోలే
భవిష్యత్తు గురించిన ‘ నీ ‘ కలలే !
‘నీవు‘ —
నిజంగా నీవు కాని వాటితో
నిర్వచింపబడటానికి
నిశ్చయించుకున్నపుడే —
‘నీవు ‘ ” రూపసి ” వని
మరిచిపోయావు !!
( పై రచయిత్రిని తెలుగు పాఠకులకు పరిచయం చేయడానికి ఈ అనువాదం చేయబడింది)
సోర్స్ : గూగుల్
Also read: వేదన
Also read: మూడు కానుకలు
Also read: 12. ప్రవక్త — పసివాడు
Also read: సౌందర్యం
Also read: ప్రజలే ప్రభువులు