- ఇది రెండో సారి సాధించిన టైటిల్ విజయం
- అవలీలగా రెండు వరుస సెట్లతో గెలిచిన సింధూ
మాలవికా బన్సద్ ను ఓడించి పీవీ సింధూ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బాడ్మింటన్ టోర్నమెంటులో గెలుపొంది టైటిల్ గెలుచుకున్నది. రెండు సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న సింధూ రెండు వరుస సెట్లు గెలిచి తనకంటే చిన్నవయస్కురాలైన మాలవికను ఓడించింది. కోవిద్ వల్ల చాలామంది క్రీడాకారులు దూరంగా ఉన్న కారణంగా టాప్ సీడ్ సింధూ విజయం తేలికయింది. 21-13, 21-16 పాయంట్లతో రెండు వరుస సెట్లు గెలుచుకున్నది. 2017లో వరల్డ్ టూర్ సూపర్ 300 ఈవెంట్ లో టైటిల్ గెలుచుకున్న తర్వాత సయ్యద్ మోదీ టోర్నమెంటులో అగ్రగామిగా నిలవడం సింధూకు ఇది రెండోసారి.
అంతకంటే ముందు ఏడో సీడ్ ఇషాన్ భట్నగర్, తానీషా క్రాస్టో లు హేమా నాగేందర్ బాబూ, శ్రివిద్యా గురజాడను ఓడించి మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు. 21-16చ 21-12 స్కొర్ లో వరుసగా రెండు సెట్లు గెలుచుకున్నారు.
మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఆర్నాడ్ మెర్కెల్, లూకాస్ క్లేర్బోట్ మధ్య జరగవలసి ఉండింది. కానీ వారిలో ఒకరికి కోవిడ్ సోకడంతో మ్యాచ్ ని రద్దు చేశారు. ప్రపంచ ర్యాంక్ లో ఏడో స్థానంలో ఉన్నసింధూకూ, 84వ స్థానంలో ఉన్న యువతి బన్సద్ మధ్య మ్యాచ్ లో సింధూ అలవోకగా గెలుస్తుందని అందరూ అనుకున్నదే. సింధూ తన అనుభవాన్నీ, ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది. బన్సద్ సమాధానం చెప్పలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సంపాదించిన సింధూ ఎదుట బన్సద్ నిలువలేదని అందరూ ఊహించిందే.