———————————
Dr. C. B. Chandra Mohan
——————————-
కాల యవనిక వెనుక
కంకాళాల కరాళ నృత్యం
కఠోర భీభత్సం !!
చేర్పు లేక వలస బోయిన మనిషితనం !
కాలం కన్నుల్లో
నీటి జ్వాలలు రగిలించిన
దరిద్ర దేవత !!
కూలి పోయిన వలసలు
కూలీ పోయిన వలసలు
కళ్ళ ఎదుటే కాలం చెల్లిన ప్రాణాలు
ఆవిరిగా మారిన చిత్రాలు
విచిత్రాలు !!
పేగు బంధాలు పుటుక్కు మన్న నిశ్శబ్ద ధ్వని
సందేహంలో
దూరిన దేహం
ఇదేగా !
గడచిన యేడాది ఒక యుగం !!
ఊరుకుంటామా !
నిరాశా దుప్పట్లు కప్పుకుంటామా?!
కోటానుకోట్ల కోటానుకోట్ల
గాలక్సీల
పరిధిలో
ఆలోచనా పరమాణు విస్ఫోటన
చేస్తాడు మనిషి
తప్పకుండా !
విశ్వమంత యెత్తు యెదుగుతాం
కాలానికి విశ్వానికి
కత్తుల వంతెనలు కడతాం !!
మనిషీ ,
అదరకు
బెదరకు
విశ్వం అనంతమైతే
యోచన అనంతానంతం !!
సాగిపో ముందుకు
జయాపజయాల
పరిధులు
దాటిపో !!
Also read: ప్రేమా , అసహ్యమూ
Also read: ఇద్దరు రాకుమార్తెలు
Also read: ఇట్లు అమ్మ
Also read: విపణి వీథి
Also read: వాంఛ