రాజస్ధాన్ లోని సవాయ్ మాధోపూర్ లో బర్వారా ఫోర్ట్ లో గురువారంనాడు ప్రముఖ నటీమణి కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం అంగరంగవైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం వారు హెలికాప్టర్ లో సవాయ్ మాధోపూర్ నుంచి జైపూర్ విమానాశ్రమానికి చేరుకున్నారు. కత్రీనా పసుపురంగు కుర్తీలోనూ, విక్కీ కౌశల్ కుర్తాలో హెలికాప్టర్ ఎక్కుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. భద్రతా సిబ్బంది రక్షణలో వారు ఉన్నారు. పెళ్ళి సమయంలో సబ్యసాచి తయారు చేసిన దుస్తులను కత్రీనా,విక్కీ ధరించారు. అభిమానుల నుంచి ప్రేమనూ, ఆశీస్సులనూ కోరుకుంటున్నట్టు మీడియాతో వధువరులు చెప్పారు.
డిసెంబర్ 7వ తేదీన సవాయ్ మాధోపూర్ లో పెళ్ళి ఉత్సవాలు ప్రారంభమైనాయి. మెహెందీ కార్యక్రమంతో ఉత్సవాలు ఆరంభమైనాయి. ప్రియాంకా చోప్డా, దీపికా పడుకోన్, అనుష్కాశర్మ, అలియా భట్, సారా అలీఖాన్, తదితరులు కత్రీనా, విశాల్ కు శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘జీవితమంతా సంతోషంగా ఉండాలి’ అంటూ సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. పెళ్ళికి పిలుపు అందకపోయినా అర్పిత సంతోషంగా కత్రీనాకు అభినందనలు తెలియజేసింది. కత్రినా, సల్మాన్ పలు చిత్రాలలో కలిసి నటించారు. కత్రీనా సల్మాన్ కుటుంబానికి చాలా సన్నిహితురాలు. కత్రీనా, విక్కీకౌశల్ తమ హనీమూన్ ని మాల్దీవ్స్ లో గడుపుతారని అంటున్నారు.