మిట్చెల్ మార్ష్, విలియం వార్నర్
- తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియా
- న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ అద్భుత బ్యాటింగ్
- ఆస్ట్రేలియాను గెలిపించిన మార్ష్, వార్నర్
దుబై: ఇక్కడ ఆదివారంనాడు జరిగిన టీ20 ఫైనల్స్ లో న్యాజిలాండ్ పై ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. టీ20 ఫైనల్ లో ఆస్ట్రేలియా గెలుపొందడం ఇదే ప్రథమం. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకున్నది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 48 బంతులలో 85 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజెల్ వుడ్ 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించారు. నాలుగో వికెట్టును ఆదం జంపా తీసుకున్నాడు.
ప్రారంభంలోనే ఒక వికెట్టు కోల్పోయిన ఆస్ట్రేలికా క్రమంగా తట్టుకొని నిలిచింది. వార్నర్ ధాటిగా ఆడాడు. మైకేల్ మార్ష్ కూడా బాగా రాణించాడు. ఇంకా ఎనిమిది బంతులు ఉన్నాయనగానే ఆస్ట్రేలియా న్యూజీలాండ్ మొత్తాన్ని దాటింది. అంతకు మందు దుబాయ్ లోనే జరిగి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాజట్టు అద్భుతంగా ఆడి పాకిస్తాన్ పైన విజయం సాధించింది. మరో సమీఫైనల్ అబూధాబీలో జరిగింది. అందులో ఇంగ్లండ్ పైన న్యూజీలాండ్ విజయం సాధించి ఫైనల్ కు చేరుకున్నది. ఫైనల్ లో ఆస్ట్రేలికా ధాటికి తట్టుకోలేకపోయింది.