తెలంగాణ ఎర్పాడినప్పులు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల వరకు అప్పులు ఉంటే అదనంగా మరో 4 వేల కొట్లు అప్పులకు ఎదురు చూడటం కేసీఆర్ సర్కార్ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. ఇప్పటికే తెచ్చిన అప్పులు, వాటిపై మిత్తీలు కట్టలేక రాష్ట్రఖాజాను ను దివాల తీశారని అరోపించారు. అప్పులతో ప్రభుత్వాన్ని ఎవరైన నడపవచ్చిన అందుకు ఉద్యమ నేత ముసుగు ఎందుకని ప్రశ్నించారు. అప్పులకు ఇక ప్రభుత్వ అస్తులను కుదవ పెట్టడం,వాటిని అమ్మివేయ్యడం తప్పా తెలంగాణలో మిగిలింది ఏది లేదన్నారు. కేవలం అప్పులతోనే ప్రభుత్వం నడిపేందుకే పనికి వస్తారని మరెటువంటి పని కేసీఆర్ కు చేతకాదన్నారు. మద్యం ద్వార వచ్చే ఆదాయంపై టార్గెట్ పెట్టి రాష్ట్రన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మరో వైపు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు గడువు దాటి వారం రోజులు అయినా చెల్లించడంలేదన్నారు. ఇక కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలకోసారి చెల్లిస్తూ వారిని అర్ధకాలితో గోసపెడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు..ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ కు ఇచ్చే నగదు, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విద్యార్ధుల ఫీజ్ రీయంబర్స్ మెంట్ వంటి పథకాలకు నిధులు విడుదల చేయ్యని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు పథకం పూర్తిగా అప్పులతోనే నడుస్తున్నదని అన్నారు. ఇప్పడు యాసింగి వచ్చింది రైతుబంధు చెల్లిస్తూందో లేదో అని అనుమానం వస్తోందని చేప్పారు. నిధులు లేకపోవడం తో కొత్త అసరా పథకం అప్లికేషన్లు పెండింగ్ లో పెట్టిందని అన్నారు. 10 లక్షల అప్లీకేషన్లు పెండింగ్ లో పెట్టి అర్హుల అప్లికేషన్లు గడువు పెట్టి తాత్సరం చేస్తూందని అరోపించారు.
విద్యార్ధులకు రావాల్సిన స్కాలర్ షిప్ లు, ఫీజ్ రీయింబర్స్ మెంట్ బాకాయిలు రెండేళ్లుగా పెండింగ్ లోనే ఉన్నాయని, 4 వేల కొట్లు చెల్లించకుండా విద్యార్దులను తీవ్ర ఇబ్బందుకు గురిచేస్తూ వారిని చదవుకు దూరం చేస్తూన్నకేసీఆర్ ప్రభుత్వన్ని గద్డేదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.