విద్య అంటే కేవలం లెక్కలు, సైన్స్ మాత్రమే కాదు. శరీరానికి వ్యాయామం, బుద్ధికి లౌకిక శాస్త్రాలు, మనో సంస్కారానికి లలిత కళలు, ఆత్మకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. ఇందులో ఏది లోపించినా పోలియో వచ్చినవాడి అవిటితనం లాంటిది ఉన్నట్లే.
లలిత కళల ద్వారా లభించే సంస్కారం, మృదుత్వం లేని మనుషులు అవతలి వాడి బాధను లెక్కచేయని రాక్షసులవుతారు. మనం చూస్తూనే ఉన్నాం కరోనా జీవి తయారు చేయడం, దాన్ని నివారించే ప్రయత్నం అంటూ వైద్యశాలల్లో లక్షలు గుంజడం. బుద్ధి పెరిగి మనసు పెరగని ఉదాహరణలే. మేధావుల అలసత్వంతో ఇప్పటికే చాలా ఆలస్యం, తద్వారా వినాశం జరిగింది. ఇప్పటికైనా తల్లితండ్రులు, విద్యావేత్తలు మేలుకుని భవిష్యత్ తరాలనైనా కాపాడాలి.