- 15 రౌండ్ల కౌంటింగ్ తర్వాత రాజేందర్ ఆధిక్యం 11,500 ఓట్లు ఆధిక్యం
- కాంగ్రెస్ కు రెండు వేల ఓట్లు దాటని వైనం
- సుమారు 20 వేల మెజారిటీతో రాజేందర్ గెలుపొందే అవకాశం
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర విజయఢంకా మోగిస్తున్నారు. ఓట్ల లెక్కింపు మంగళవారంనాడు (నవంబర్ 2) ఉదయం ప్రారంభం కాగా మధ్యాహ్నం 4.15లకు పదిహేను రౌండ్లు లెక్కిపు పూర్తయింది. ఆ దశలో ఈటల రాజేందర్ హవా కొనసాగుతోంది. ఒక్క రౌండులో కూడా ఆధిక్యం తగ్గకుండా ఈటల ప్రభ కొనసాగుతోంది. 15వ రౌండు లెక్కింపు ముగిసే సరికి ఈటలకు 68,586 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లి శ్రీనివాస్ కు 57,003 ఓట్ల పోలైనాయి. మొత్తం పోలైన ఓట్లు 2,05,270. కాంగ్రెస్ కు 1,982 ఓట్లు పడినాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి 62 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. అటువటి కాంగ్రెస్ పార్టీ ఈ సారి నామ్ నిషాన్ లేకుండా పోయింది. ఈటల రాజేందర్ కూ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికీ రహస్య ఒప్పందం కుదిరినట్టు చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ ను బీజేపీ ఓడించేందుకు వీలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం ఉన్న వారిని చీల్చకుండా మొత్తం అందరూ బీజేపీ ఓటు వేసే విధంగా బలహీన అభ్యర్థిని, చివరి క్షణంలో ఆలస్యంగా రంగంలోకి దించుతామనీ, నామమాత్రం ప్రచారం చేస్తామనీ రేవంత్ రెడ్డి ఈటలకు హామీ ఇచ్చారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ ఆరోపణకు రేవంత్ రెడ్డి ఏమి సమాధానం చెబుతారో, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాలపైన ఏఐసీసీ పర్యవేక్షకుడు మణిక్కం టాగోర్ ఏమి సంజాయిషీ చెబుతారో చూడాలని కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
మొత్తంమీదికి ఈటల రాజేందర్ విజయం సాధించడం టీఆర్ఎస్ కూ, ముఖ్యంగా కేసీఆర్ కు పెద్ద ఎదురు దెబ్బ. నవంబర్ మాసం టీఆర్ఎస్ కు కలిసి రావడం లేదనీ, నిరుడు నవంబర్ 10 తేదీని దుబ్బాక ఓట్లు లెక్కింపు జరిగితే టీఆర్ఎస్ పైన బీజేపీ ఘనవిజయం సాధించదనీ, ఇప్పుడు ఈ నవంబర్ రెండో తేదీన లెక్కించిన హుజూరాబాద్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నదనీ వారు చెబుతున్నారు.
టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్వగ్రామం సింగాపురంలో బీజేపీ మెజారిటీ వచ్చిందనీ, దళితబంధు పథకం నూటికి నూరుశాతం అమలు చేసిన గ్రామాలలో సైతం బీజేపీకి మెజారిటీ రావడంలో టీఆర్ఎస్ కు దిమ్మతిరిగినట్టు అవుతోందని పరిశీలకులు అంటున్నారు. కౌశిక్ రెడ్డి స్వస్థలం, టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ పుట్టిన ఊరు ఉన్న వీణవంక మండలంలో సైతం బీజేపీ అభ్యర్థి ఆధిక్యం రావడం విశేషం. రేయింబవళ్ళూ హరిష్ రావు శ్రమించి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
జీజేపీ సీనియర్ నేత, దేశీయాంగమంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ చేసి ఈటల ఆధిక్యంలెో ఉన్నందుకు అభినందనలు తెలిపారు.
Also read: ఈటల రాజేంద్ర విజయం సాధిస్తే వినూత్న రాజకీయ పరిణామాలు