ఉదయించే పూర్ణచంద్రుడి లాంటి చపాతీ
పొర్లుకట్ట దాటడానికి పదే పదే ప్రయత్నించే
చెరువులోని అలల్లాంటి పొరల పరోటా
కుతకుత ఉడికిన మనసులా
ఘుమ ఘుమ లాడే పొంగల్
ధుమ ధుమ లాడే నూనెలో
బుస బుస పొంగే పూరీ
అన్నీ అందరికీ అందిస్తా
కరకరలాడే నా కడుపుకు మాత్రం కాదు.
ఏదీ లేకపోతే ఒక ఏడుపు.
అన్నీ ఎదురుగా ఉండి
అందుకోలేకపోతే
అదే వినిపించని ఆకలి కేక.
Also read: అరుణం
Also read: శివోహం
Also read: మజిలీ
Also read: దేవదాసి
Also read: అభయం