Tuesday, December 3, 2024

అరుణం

                                                                                                                                నువ్వు కాలానివి

కాలాన్ని పుట్టించేది నువ్వే

గిట్టించేది నువ్వే

నువ్వు కాలంలో గాలానివి

గాలంలోని చేపను

రక్షించేది నువ్వే

భక్షించేది నువ్వే

మొదలు నువ్వే

చివర నువ్వే

మధ్య కూడా నువ్వే

నువ్వు కాలంలోని సారానివి

హృదయంలోని రసానివి

నువ్వు జీవన గీతానివి

జీవగీతానివి

జీవితంలోని జీవానివి

జీవింపజేసే దైవానివి

(అరుణం= సంధ్యా సమయం / కాలం / ప్రేమ)

Also read: నో వేకెన్సీ

Also read: శివోహం

Also read: మజిలీ

Also read: దేవదాసి

Also read: అభయం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles