రథ గజ తురగ పదాతి దళాలతో
కత్తి ఈటె గద బాణాలతో
ముష్టి ఘాతాలతో యుద్ధాలు జరిగేవి ఒకప్పుడు రాజ్యాల కోసం.
తుపాకులు, బాంబులు,
రాకెట్లు, మైన్లు, క్షిపణులు,
విమాన యుద్ధాలు
ఆర్థిక ఆంక్షలు నిన్నటి దాకా
ఆధిపత్యం కోసం.
ఉగ్రవాదులు, డ్రోన్లు,
సంహారక క్రిములు, రసాయనాలు,
ఆర్థిక సంక్షోభాలు
నేటి పోరు బాట.
రాముడి ఉదాత్త గుణ శీలత పోయి
ఊర మాస్, పక్కా లోకల్
రాజ్య మేలుతున్న వేళ
ఇంకా సత్యం, అహింస
అనే, అనుకునే, పాటించే వాళ్లకు
చోటుందా మన మధ్య.
Also read: నాగరికథ
Also read: మహర్షి
Also read: నవ్వుల జల్లు
Also read: వీరభోజ్యం
Also read: అమ్మ – అమ్మమ్మ