నేను రాజును
రాజాధిరాజును
ప్రజకు అధినాయకుడిని
నాయకులైనా, మండలాధీశులైనా
అందరూ నా మాట వినాల్సిందే
నేను అనుకున్నది జరగాల్సిందే
కాదంటే శత్రు సంహారమే
ఊరూరా నా సైనికులున్నారు
ఎవడైనా ఎంతటివాడైనా
నోరెత్తే సాహసం చేస్తే
ఆ నోరు మూయించేస్తా.
కులం మతం నా కవచాలు
దానం దండం నా ఆయుధాలు
అందర్నీ శాసిస్తా
ఎదురులేని నేను
సర్వంసహా చక్రవర్తిని.
Also read: అమ్మ – అమ్మమ్మ
Also read: సవాల్
Also read: సంతోషం
Also read: శాంతి
Also read: మార్గదర్శి