- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదుకోవాలి
- పరిశ్రమ అంటే వేలమంది పనివారు, నలుగురైదుగురు హీరోలే కాదు
హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమ కష్టాలలో ఉన్నదనీ, దానిని ఆదుకోవాలనీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. పార్క్ హయ్యత్ హోటల్ లో ‘లవ్ స్టోరీ’ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ లో హిందీ నటుడు ఆమీర్ ఖాన్ తో పాటు పాల్గొంటూ చిరంజీవి ఫిలిం పరిశ్రమలో స్థితిగతుల గురించి మాట్లాడుతూ కించిత్ ఆవేశానికి లోనైనారు. సినీ పరిశ్రమంలో నలుగురైదుగురు హీరోలు కాదనీ,వారికి అత్యధిక పారితోషికం అందవచ్చునేమో కానీ కష్టాలు పడుతున్నది చిరుద్యోగులూ, సాంకేతిక సిబ్బందీ, ఇతరులూ అనీ మెగాస్టార్ చెప్పారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల అవుతుంది.
చిరంజీవి, ఇతర సినీ పరిశ్రమ పెద్దలు సోమవారం, సెప్టెంబర్ 20న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకోవలసి ఉంది. కార్యక్రమం ఖరారైనదీ, లేనిదీ తెలియదు. ముఖ్యమంత్రులు పరిశ్రమ పట్ల దయ చూపించాలని చిరంజీవి అన్నారు.