మానవ రూపంలో దైవం
విశ్వామిత్ర శిష్యుడు మహావీరుడు
శివ ధనుర్భంగం చేసిన బలశాలి
పరశురాముడి పరశువు వదిలించిన దివ్యమూర్తి
సీతా పరిణయంతో ఏకపత్నీవ్రతుడు
తల్లి తండ్రి మాటకు చింతించక
రాజ్యం త్యజించిన త్యాగమూర్తి
అడవుల్లో రుషులను సేవిస్తూ
రాక్షసులను సంహరిస్తూ
సామాన్య గుహుడితో మిత్రత్వం
మాన్య శబరి ఆతిధ్యం
అహల్య విమోచనం
సుగ్రీవుడికి స్వాంతన
మారుతి సాన్నిహిత్యం
రామసేతు నిర్మాణం
దుష్ట రావణ సంహారం
సీతా పునస్సమాగమం
ధర్మానికి పట్టాభిషేకం
రామ రాజ్యానికి ఆరంభం.
Also read: ఆడపిల్ల
Also read: అర్ధనారీశ్వరం
Also read: కవితోత్సవం
Also read: తెల్ల జండా
Also read: నవ్వుల వీణ