Sunday, December 22, 2024

తమ భూములు రక్షించుకునేందుకు మహిళల ఉద్యమం

  • వరంగల్ జిల్లాలో భూదందాకోరుల అరాచకం
  • పోచమ్మ బోనాల జాతరలో బోనంతో పాటు ప్లకార్డులతో నిరసన తెలిపిన మహిళ రైతులు..
  • ల్యాండ్ బ్యాంక్ కు రెండు పంటలు పండే వ్యవసాయ భూములు ఇవ్వం అంటూ నినాదాలతో మారుమోగిన బోనాల జాతర.
  • అరేపల్లి, పైడిపల్లి గ్రామ రైతులకు మద్దతుగా అరేపల్లిలో మహిళలు బోనాలతో నిరసన

రిపోర్టర్: సాదిక్

వరంగల్ జిల్లా అరేపల్లిలో గత వారం రోజులుగా ప్రైవేట్ వ్యక్తులు ‘కుడా’ (KUDA) పేరుతో భూములు లాక్కోవాలని చేసిన ‘దొంగ’ సర్వేకు వెతిరేకంగా అరేపల్లి, పైడిపల్లి రైతులు ఉద్యమిస్తున్నారు. అందులో భాగంగా నేడు అరేపల్లి, పైడిపల్లిలో పోచమ్మ బోనాలు సందర్భంగా మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పోచమ్మతల్లి బొనాల సందర్భంగా మహిళలు బోనంతో పాటు మా భూముల జోలికి ఎవరూ రావద్దని, ల్యాండ్ బ్యాంక్ కు వ్యవసాయ భూములు ఇవ్వం అని, దొంగ సర్వేలు అపి రైతులకు న్యాయం చేయాలని ప్లకార్డులతో వినూత్నంగా నిరసన తెలిపారు. బోనాల జాతరలో అధికారుల పేరుతో దొంగ సర్వేలు చేసిన వారికి బుద్ది మారాలని, మా వ్యవసాయ భూముల జోలికి ఎవరు రావద్దని, రెండు పంటలు పండే భూములను ఎవరికి ఇవ్వబోమని ప్లకార్డులు చేతపట్టుకొని, నెత్తిమీద బోనంతో రైతులకు మద్దత్తుగా మహిళలు కదిలారు. అరేపల్లిల్లో ప్రతియేడాది పోచమ్మ బోనాలను ప్రత్యేకంగా జరిపే గొల్ల, కురుమలు ఈ ఏడాది నిరసనలతో బోనం సమర్పించారు.  ఏప్పుడు డప్పు చప్పుళ్ళ మధ్య వెళ్లే బోనాలు, ఈ రోజు మాత్రం భూములు లాక్కోవాలని చూసిన వారికి బుద్ది రావాలని నినాదాలు చేస్తూ ,ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఈ బోనాల ర్యాలీ సాగింది..

ఈ ఉద్యమంలో గ్రామప్రజులు మహిళలు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

తమ భూములు ఇవ్వబోమంటూ మహిళలు నిరసన తెలుపుతున్న దృశ్యం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles