విలువలు వదిలేసిన
విపణి లో
పోర్నో సుడిగుండాల
అంతర్జాల సంద్రం లో
అన్నీ ఉచితమే !
సంభాషణలు ఉచితం !
సందేశాలు ఉచితం
జీబిలు గా డాటా ఉచితం
కాల హరణ టిక్ టాక్ ల బట్వాడా ఉచితం
మనిషి పతనం చెందే
ప్రతీది ఉచితం !
ఉచితాలు వెనుక సముచితం కానిది ఉంది !
ఎదగని మెదళ్ళ కళ్ళు
యు ట్యూబు ల కాళ్ళని చుట్టుకుంటాయి !
తెలియని మోహ సర్పం బుసలు
కొడుతుంది !
వాయెరిజం తో మొదలైన వాంఛ
వయలెన్స్ గా అంతమవుతుంది !
నియంత్రణ లేని
నియమాలు లేని
నిరంతర నిర్లజ్జ వీడియోలు నిత్యం
సరఫరావుతుంటాయి !
ప్రభుత్వాల ది ఒక
ప్రేక్షక పాత్ర
సాంకేతికత తో ప్రపంచం అర
చేతికి వచ్చినా ,
సంస్క్రుతి లుప్తమై
మానవత్వమే
ఒక
కత్తి అంచున నిలుస్తుంది !
ఏ ఫోన్ ఏ మోహ
నిలయమో
ఏ ఫోన్ ఏ భావ
విలయమో !
మనిషిని,మనిషిని
కలిపే మాధ్యమం
దూరాల్ని దగ్గర చేసే
మాధ్యమాలు
శాంతి ని ఇవ్వలేని
మిధ్యా సౌధాలు !
అంతర్జాలం
కాకూడదు మాయా మోహాజాలం !
జాగురకత తో వెయ్యాలి
అడుగులు జాగృతి వైపు !
Also read: యత్ర నార్యస్తు లభతే,రమంతే తత్ర రాక్షసాః
Also read: ఫీ ని క్స్
Also read: చర్విత చర్వణం
Also read: నాన్నకి తెలిసినది
Also read: ఇలా మిగిలాం !
Good poem