చిన్నప్పుడే నింద వేశారు
తెలివితేటలు లేవని
వయసొచ్చింతర్వాత నిందలేశారు
ఎవరినో పెళ్లాడేశానని
స్వంతానికి రూపాయి వాడుకోకుండా
కుటుంబాన్ని చూసుకున్నా
నింద వేశారు స్వార్ధపరుడనని
పెళ్లాం పిల్లలే ముఖ్యమయ్యారని.
పెద్దలేసిన నిందలు సహించాను
అందుకే పిన్నలూ వేస్తున్నారు.
స్నేహితులనూ దూరం చేశారు.
కుటుంబం కోసం
నేను కోరుకున్న జీవితం వదులుకున్నా
దశాబ్దాలుగా దుష్ప్రచారం
నాపై సాగుతూనేఉంది.
ఎందుకీ గొడవ అని
దూరంగావున్నా
అదీ నిందార్హమైంది.
ఏటా విఘ్నేశ్వరుడిని పూజిస్తున్నా
నిందలు మాత్రం తప్పడం లేదు
నాకిక భరించే ఓపికలేదు
నీ నిందలను బాపుకున్న కృష్ణా
నువ్వే నాకు మార్గం చూపించు.
Also read: అంధాంద్ర
Also read:స్వామి
Also read: దేవుడు
Also read: స్సందన