నీ తలపులు
నా మనోవాకిళ్ళు తెరిచినపుడు
కోకిల గానాలు
పురివిప్పిన నెమళ్ళు
శ్రావణ సంధ్యా రాగాలు
శారద రాత్రుల వెన్నెలలు
ఆమని చిగుర్ల నును లేత పచ్చందనాలు
పైరుగాలి పరిమళాలు
నీ పాటతొ పరవశించే
ప్రకృతి ప్రతిస్పందనలు
నా చుట్టూనే కాదు
నాలోనూ ఉంటాయి
Also read: క్విట్ ఇండియా
Also read: ఇది వేద భూమి
Also read: ఫ్రపంచం
Also read: విజ్ఞానం – జ్ఞానం
Also read: స్నేహం