ఆదిమానవ జంతువు
ప్రకృతికి భయపడ్డాడు
ఉరుము, మెరుపు, చీకటి,
నీరు, నిప్పు, జంతువులు
అన్నిటికీ జడిశాడు
చెట్ల తొర్రల్లో, గుహల్లో దాక్కున్నాడు
క్రమంగా అనుభవం, ఆలోచన పెరిగాయి
ప్రకృతిపై పైచేయి సాధిస్తూ వచ్చాడు
అరణ్యాలను నరికేశాడు
భూగర్భాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు
భూమికి సార్వభౌముడయ్యాడు
ఆకాశ, సముద్ర విహారం చేశాడు
ప్రకృతిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు
విలవిలలాడిన ప్రకృతి ప్రకోపం
భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు
తుపానులు, ఉప్పెనలుగా ఉబుకుతూనే ఉంది.
అణ్వాయుధాల, గ్రహాంతరయానాల సందడిలో
తలమునకలవుతున్న వైజ్ఞానికుడికి
జ్ఞానబోధ చేయడానికి
సంభవామి యుగే యుగే అన్నట్లు
విలయాలు కొత్తకొత్త అవతారాలతో
వినాశం సృష్టించి బుద్ధి చెబుతున్నాయి
నిన్నటి మశూచి, ప్లేగు, కలరాలు
నేటి కరోనా చెప్పే పాఠం ఒకటే
ప్రకృతికి భయపడో
ప్రకృతిని లెక్కచేయకుండానో కాక
ప్రకృతితో మమేకమై బ్రతకమని
అదే మనిషి బ్రతుక్కి పరమార్థమని
Also read: తపన
Also read: ప్రేమ
Also read: స్కూలీ
Also read: వెన్నెముక లేని మనిషి
Also read: మూడో కన్ను