ఒకప్పుడు తళతళ లాడిన లోహ(క)పు బిందె
వాడి, వాడి, రాచుకొని, గీచుకొని,
క్రింద పడి, దొర్లి, తుళ్ళి,
పట్టుకొని, పట్టుకొని, కొట్టుకొని, కొట్టుకొని
అరిగి, తరిగి, అంచులు విరిగి,
ఎన్ని సొట్టలో, ఎన్ని మాసిపోని గీతలో?
ఎన్ని సార్లని టింకరింగ్ చేస్తాడు అతను మాత్రం?
ఒక్కసారి గా కొరోనాగ్ని లో కరిగించి వేస్తున్నాడు.
తళతళ లాడే క్రొత్త లోహ(క)పు బిందె
తిరిగి పుడుతుందా?!
Also read: ఇల్లు
Also read: జ్ఞాపకాలు
Also read: ఆమె
Also read: సమయం లేదు మిత్రమా
Also read: నీతో