నీతో కలిసి అడుగులు వేయడం
…అది ఒక అపురూప అనుభవం…
తారలు త్రుళ్లి పడుతున్న ఆకాశం నీడలో
అడవి జాడలవెంట…
ఎప్పటి లాగే ప్రకృతి అందాలను ధిక్కరిస్తూ నావెంట నీవు
చిలిపి నవ్వుల ఖడ్గం తోఁ నా గుండెపై గాటు లు వేస్తూ…
అదేమిటో ఎప్పుడు మాటలన్నీ నావే…
నీవు మాత్రం నిశ్శబ్దంగా నడుస్తూ
అప్పుడప్పుడు వంగి గడ్డి పూలను కోస్తూ
ఒ క్కో సారి ఆకుల సందుల నుండి తొంగి
చూస్తున్న చందమామ ను పలుకరిస్తూ…
మౌనం గా అలాగే రాత్రి కరిగే దాక గడిపేస్తావు
నా గుండె కొట్టు కోవడం నాకు ఒక వ్యర్ధ నిరీక్షణ స్వరంలా
బిగ్గరగా, మరింత బిగ్గరగా, భయ పెట్టేటంతగా
నాకే వినిపిస్తూ ఉంటె…
అవే ఆలోచన లు, అదే భావోద్వేగం
నా గుండె ను నలిపేస్తుంటే…
కొంత శూన్య ప్రహారం… కొంత శబ్ద ప్రకంపనం…
ఏమో నిన్ను ఎప్పటికి అర్థం చేసికో లేనేమో…
తడిసి తడిసి ముద్దై
వెచ్చని ఇసుక తీరాల కోసం ఎదురు చూస్తూ
సాగరం లో కొట్టుకు పోతున్న
చెక్క దుంగ లా ఎప్పటి కి ఇలాగే ఉండిపోతానేమో !
ఇంతలో తూరుపు దిక్కులో ఒక పలుచని సూర్యకిరణం మెరిసింది…
ఇంకోక్కసారి ఆశ గా నిన్ను చూసి ఒక గాఢ మైన నిట్టూర్పు విడుస్తాను
…గుండెలో అప్పుడే మొదలై న ఒక రగిల్చే మంట !
Also read: కవిత్వం ఒక విచిత్రం
Also read: గాలిపటం
Also read: పంది కొక్కులు
Also read: చరిత్రకారుడు
Also read: యుద్ధం